Krithi Shetty : ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలో మంచి క్రేజీ పెంచుకుంది, ఈ అందాల బ్యూటీ కృతి శెట్టి… బేబమ్మ అందచందాలతో కుర్ర కారు హృదయాలను కొల్లగొట్టింది. ఈ విధంగా ఈ అమ్మడికి, అవకాశాలు ఒకదాని వెంట ఒకటి ,రావటం మొదలుపెట్టాయి. బంగారు రాజు, శ్యామ్ సింగ్ రాయ్, సినిమాలతో ప్రేక్షకులను అలరించిన బేబమ్మ. అయితే ఇప్పుడు కొత్తగా రామ్ పోతినేని ప్రక్కన,” ది వారియర్” సినిమాతో సందడి చేయడానికి మన ముందుకి వస్తుంది కృతి శెట్టి.
ఈ మూవీ జూలై 14న విడుదల కానుండగా… వరస సినిమాలతో బిజీ బిజీగా ఉంటుంది. కృతి శెట్టి దీని నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ నాగచైతన్య గురించి ఆహ్లాదకరమైన విషయాలను చెప్పింది. నెక్స్ట్ మంత్ లో నాగచైతన్యతో, మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పింది. నాగచైతన్య సరసన నటిస్తున్నందుకు, నాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పింది. మా జంటను చూసేందుకు ప్రేక్షకులు, ఆసక్తికరంగా వేచి చూస్తారు, అని ఈ అమ్మడు చెప్పింది.
Krithi Shetty : నాగ చైతన్య పై ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ప్రశంశల జల్లు.

నాగచైతన్యతో కలిసి నటిస్తే, ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెప్పింది కృతి. ఇంకో మంచి చిత్రాన్ని అభిమానుల ముందుకి తీసుకొస్తున్నామని, తన అభిప్రాయాన్ని చెప్పింది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ప్రశాంతత కోల్పోతామని చాలామంది, నాతో అన్నారు. కానీ నాగచైతన్య ఎంతో మంచి మనసు కల వాడని, నిజాయితీగా ఉంటాడని, గొప్ప గుణశీలి అని, నాగచైతన్యతో కలిసి సినిమాలో వర్క్ చేయటం ,నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది అని, ఈ అందాల భామ కొనియాడింది.