Krithi shetty : కన్నడ బ్యూటీ కృతి శెట్టి ‘ ఉప్పెన ‘ సినిమాతో ఒక్కసారిగా తెలుగులో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సినిమాలో తన నటనతో యువకుల మనసులను కొల్లగొట్టింది. ఈ సినిమా హిట్ అవడంతో తనకు వరుసగా సినిమాలు చేసే అవకాశం వచ్చింది. ఉప్పెన తర్వాత నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించి మరో హిట్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత ‘ బంగార్రాజు ‘ సినిమాలో నటించి హ్యాట్రిక్ హిట్ కొట్టింది. దీంతో అమ్మడుకు వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. కెరియర్ మొదట్లో వరుస హ్యాట్రిక్ హిట్లు అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ప్లాప్ సినిమాలతో డల్ అయిపోయింది.
Krithi shetty : భారీ మొక్కు మొక్కిన కృతి శెట్టి…
ఈ మధ్యనే విడుదలైన రామ్ పోతినేని నటించిన ‘ ది వారియర్ ‘ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత నితిన్ ‘ మాచర్ల నియోజకవర్గం ‘ సినిమా కూడా ప్లాఫ్ కావడంతో ఆమె కెరియర్ కు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ గా మారింది. దీంతో కృతి తన తర్వాతి సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంది. ఒకవేళ ఈ సినిమా కూడా సక్సెస్ కాకపోతే వరుస హ్యాట్రిక్ హిట్లు అందుకున్న కృతి శెట్టి ఇప్పుడు వరుస ఫ్లాప్ సినిమాలో అందుకుంటుంది అంటూ ఇప్పటికే ట్రోలర్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కృతి శెట్టి తన తర్వాతి సినిమా హిట్ అవ్వాలని గుడిలో పూజలు చేస్తుందట. ఈ క్రమంలోనే ఆమె వాళ్ళ అమ్మతో కలిసి గుడికి వెళ్లి పూజలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు తన సినిమా హిట్ అయితే దేవుడికి వెండి కిరీటం చేయిస్తానని భారీ మొక్కు మొక్కిందంట. మరి చూడాలి అందాల భామ కృతి శెట్టి కోరికను ఆ దేవుడు విన్నాడో లేదో తన తర్వాతి సినిమా రిలీజ్ అయ్యాక తెలిసిపోతుంది. ఏది ఏమైనా కృతి శెట్టి కెరీర్ పై భయం పట్టుకుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.