Krithi shetty : ‘ ఉప్పెన ‘ సినిమాతో కృతి శెట్టి ఓ రెంజ్ లో పాపులర్ అయింది. ఈ సినిమా హిట్ తర్వాత తనకు వరుస సిని ఆఫర్లు వచ్చాయి. ఈ సినిమా హిట్ తర్వాత నాని ‘ శ్యామ్ సింగరాయ్ ‘ సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా కూడా హిట్ కావడంతో కృతికి తిరుగు లేదనుకున్నారు. అనుకున్నట్టే నాగార్జున నాగచైతన్య బంగార్రాజు సినిమాలో కూడా నటించి ప్రేక్షకుల మన్ననలను పొందింది. ఈ సినిమా హిట్ అవడంతో వరుసగా హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. అంతే కృతి కళ్ళు నెత్తికెక్కి రెమ్యూనరేషన్ పెంచేసింది. కాల్ షీట్లు బుక్ చేయాలంటే క్రేజీ కండిషన్స్ పెట్టింది. దీంతో దర్శక నిర్మాతలకు కోపం వచ్చింది. కానీ జనాల్లో అనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ చేసుకొని ఆమెను హీరోయిన్ గా తీసుకోక తప్పలేదు. కానీ టైం ఎప్పుడు మన వైపే ఉండదు కదా, సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం.
భారీ అంచనాలతో విడుదలైన రామ్ ‘ ది వారియర్ ‘ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో కృతి శెట్టి ఫ్లాప్ సినిమా రుచి చూసింది. ఒక సినిమా ఫ్లాప్ అయింది నెక్స్ట్ సినిమా అయినా హిట్ అవుతుందిలే అన్న ఆశలు పెట్టుకొని నితిన్ తో ‘ మాచర్ల నియోజకవర్గం ‘ సినిమాలో నటించింది. ఈ సినిమా మరింత డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో కృతి ఎందుకు చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. ఓ బొమ్మలాగా వచ్చింది బొమ్మలాగా అయిపోయింది అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ కారణంగా కృతి ఖాతాలో మరో బ్లాక్ బ్లాస్టర్ ఫ్లాప్ సినిమా పడింది. అయితే వరుసగా రెండు బ్లాక్ బస్టర్ ఫ్లాప్ సినిమాలు పడడంతో కృతి శెట్టి బోల్డ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.
Krithi shetty : కృతి శెట్టి హిట్ కోసం క్రేజీ డెసీషన్…

ఇప్పటివరకు దర్శక నిర్మాతలకు క్రేజీ కండిషన్స్ పెట్టిన కృతి శెట్టి ఇకపై డ్రెస్ సెన్స్ విషయంలో అసలు లిమిట్స్ పెట్టదల్చుకోవట్లేదట. డైరెక్టర్స్ అడిగితే బికినీ వేసుకోవడానికి కూడా రెడీ అంటుంది. అంతేకాదు రొమాంటిక్ సీన్స్ లో హార్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కూడా రెడీ అయినట్లు తెలుస్తుంది. గ్లామరస్ ఫీల్డ్ లో టఫ్ కాంపిటీషన్లో ఉన్న ఈ ప్రపంచంలో కృతి తీసుకున్న బోల్డ్ డెసిషన్ కరెక్ట్ అంటున్నారు సినీ విశ్లేషకులు. కానీ అభిమానులు మాత్రం కృతిని బికినీలో చూడలేము అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కృతి శెట్టి ఏం చేస్తుందో చూడాలి.