Lavanya Puri : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తుంది. అదే టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ ‘ లైగర్ ‘ ఆగస్టు 25న రిలీజ్ అయ్యి అట్టర్ ప్లాప్ టాక్ ని సంపాదించుకుంది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా దారుణమైన రిజల్ట్ అందుకుంది. హీరోగా విజయ్ దేవరకొండ నటన పరంగా మెప్పించిన డైరెక్షన్ బాగాలేని కారణంగా సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది. దీంతో అటు విజయ్ అభిమానులు, ఇటు నెటిజెన్స్ పూరిని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
నీకు డైరెక్షన్ చేతకాకపోతే ఇంట్లో కూర్చో.. నువ్వు ఫెయిడౌట్ డైరెక్టర్.. అసలు మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమా ‘ పోకిరి ‘ తీసింది నువ్వేనా లేక వేరే ఎవరైనా తీసి నీ పేరు వేసుకున్నావా అంటూ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. అయితే రీసెంట్ గా పూరి పై వస్తున్న ట్రోలింగ్స్ ను భార్య లావణ్య ఘాటు కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. చాలామంది సోషల్ మీడియాలో పూరీను ట్రోల్ చేస్తున్నారు. కొందరు చార్మి పేరును మధ్యలోకి తీసుకొచ్చి ఆమెతో నీ సంబంధం తెగిపోతేనే నువ్వు డైరెక్టర్ గా బాగుపడతావ్ అంటూ సోషల్ మీడియాలో పెట్టేశారు. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ భార్య లావణ్య ఫ్రెండ్ ఫోన్ చేసి లైగర్ సినిమా ఫ్లాప్ గురించి కొన్ని వాక్యాలు చేసిందట.
Lavanya Puri : పూరిని ట్రోల్ చేసే వాళ్ళకి గట్టిగా కౌంటర్ ఇచ్చిన లావణ్య పూరి…

అయితే తనని పరోక్షంగా విమర్శించడానికి కాల్ చేసిన తన ఫ్రెండుకి ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మా ఆయన గురించి నాకు తెలుసు. మా ఆయన సత్తా స్టామినా ఏంటో అందరికీ తెలుసు. ప్రెసెంట్ టైం బాగా లేకపోవచ్చు. కానీ మళ్ళీ పూరి అంటే మన తెలుగు డైరెక్టర్ అని అందరు గర్వపడేలా సినిమా తీస్తాడు. ఆ విషయంలో నాకు గట్టి నమ్మకం ఉంది. ఒకప్పుడు మా ఆయన తీసిన సినిమాలను చూసి శభాష్ అన్న వాళ్ళే ఇప్పుడు పూరి దేనికి పనికిరాడు అంటున్నారు. మళ్ళీ అదే నోరులు పూరి మా డైరెక్టర్ అని అనిపించుకునేలా చేస్తాడు అంటూ ఘాటుగా ట్రోలర్స్ కి, తనకి కాల్ చేసిన ఫ్రెండ్ కి కౌంటర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.