Tamil Nadu : తమిళనాడులోని ఒక కార్ డ్రైవర్ కు అదృష్టం పట్టింది. మధ్యాహ్నం మూడు గంటలకు భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటున్న కారు డ్రైవర్ కు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటా అని మెసేజ్ ఓపెన్ చేసి చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే అతని ఖాతాలోకి ఏకంగా తొమ్మిది వేల కోట్లు వచ్చి పడ్డాయి. కానీ ఆ తర్వాత చాలా కథ జరిగింది.తర్వాత బ్యాంక్ యాజమాన్యం కార్ డ్రైవర్ చుట్టూ ప్రదక్షిణలు చేసి తిరిగి డబ్బును తీసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని పలనినేరక పట్టి కి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి కార్ డ్రైవర్ గా పనిచేసుకుంటున్నాడు.
అద్దె కారు డ్రైవర్ గా పనిచేస్తున్న రాజకుమార్ ఒకరోజు మధ్యాహ్నం తన కారులో నిద్రిస్తుండగా బ్యాంకు నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు ఒక మెసేజ్ వచ్చింది. ఇక ఆ మెసేజ్ లో 9వేల కోట్ల రూపాయలు రాజ్ కుమార్ బ్యాంకులో పడినట్లుగా ఉంది. అది చూసి ఆశ్చర్యపోయిన రాజ్ కుమార్ మొదట తన స్నేహితులెవరో తనపై జోక్ చేస్తూ మెసేజ్ చేసి ఉంటారని అనుకున్నాడు. నగద్ డిపాజిట్ ను క్రాస్ చెక్ చేసుకునేందుకు రాజకుమార్ అతని ఖాతాలోని డబ్బును మరోసారి క్రాస్ చెక్ చేసుకున్నాడు. అప్పుడు కూడా రూ.9,000 కోట్ల రూపాయలు డిపాజిట్ అయినట్లు తెలుసుకున్న రాజ్ కుమార్ షాక్ అయ్యాడు.
దీంతో తన స్నేహితుడికి పంపించి చూద్దామని అనుకున్న రాజ్ కుమార్ 21 వేల రూపాయలు తన స్నేహితుడికి పంపేందుకు ప్రయత్నించాడు. అయితే రాజ్ కుమార్ పంపిన డబ్బులు అతని స్నేహితుడు ఖాతాకీ బదిలీ అయింది. దీంతో రాజ్ కుమార్ ఎంతో సంతోషించాడు. అప్పుడు అది నిజమని రాజ్ కుమార్ నిర్ధారించుకున్నాడు. అయితే అది జరిగిన ఒక రోజు తర్వాత తమిళనాడు మార్కంటెల్ బ్యాంకు ప్రధాన కార్యాలయం నుండి రాజ్ కుమార్ కు ఫోన్ రావడంతో అతను సంతోషం కనుమరుగైపోయింది. తన ఖాతాలో తొమ్మిది వేల కోట్ల రూపాయల పొరపాటున జమ అయినట్లుగా బ్యాంక్ అధికారులు ఫోన్ చేసి తెలియజేశారు. అలాగే ఆ డబ్బును ఖర్చు చేయవద్దని రాజ్ కుమార్ కు విన్నవించారు.
ఇక తన స్నేహితుడికి బదిలీ చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని , మిగిలిన డబ్బును తిరిగి ఇస్తే చాలని రాజ్ కుమార్ ను కలిసి బ్యాంక్ అధికారులు నచ్చచెప్పారు. పోలీస్ అధికారులతో బ్యాంక్ యాజమాన్యం రాజ్ కుమార్ ను కలిసి అతనిక అర్థమయ్యేలా చెప్పి, తన కారుకు రుణాన్ని ఇస్తామని అలాగే భవిష్యత్తులో ఈ బ్యాంకు ద్వారా మంచి రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాజ్ కుమార్ కూడా దీనికి అంగీకరించాడు. అయితే బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వలన రూ.9,000 కోట్లు ఒక కార్ డ్రైవర్ ఖాతాలో పడడం ప్రతి ఒక్కని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. దీంతో ప్రతి ఒక్కరూ బ్యాంక్ యాజమాన్యాన్ని తిట్టిపోస్తున్నారు.