Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఒక అన్న ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఇటీవలే మరణించారు. రమేశ్ బాబు మరణించిన కొన్ని రోజులకే ఆయన తల్లి ఇందిరా దేవి మరణించింది. ఆమె మరణించిన కొన్ని రోజులకే సూపర్ స్టార్ కృష్ణ కూడా మరణించారు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీలో ఒకే సంవత్సరంలో ముగ్గురు మరణించడంతో ఘట్టమనేని ఫ్యామిలీ శోకసంధ్రంలో మునిగిపోయింది. అయితే.. మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కూడా అప్పట్లో సినిమాల్లో నటించారు. హీరోగానూ పలు సినిమాలు చేశారు.

సూపర్ స్టార్ కృష్ణతో కలిసి కూడా రమేశ్ బాబు ఎన్ కౌంటర్ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆయన సినిమాల్లో నటించలేదు. నిర్మాతగా మారిపోయారు. నిర్మాతగా పలు సినిమాలను నిర్మించారు. నిర్మాతగా స్థిరపడిపోయిన రమేశ్ బాబుకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. నిజానికి మహేశ్ బాబుకు తన అన్న రమేశ్ బాబు అంటే ప్రాణం. తన అన్నను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు మహేశ్. కానీ.. రమేశ్ బాబు చనిపోయినప్పుడు ఆయన చివరి చూపును కూడా చూసుకోలేకపోయారు మహేశ్. అప్పుడు కరోనా రావడంతో ఆయన భౌతికఖాయాన్ని కూడా మహేశ్ చూడలేకపోయారు.

Mahesh Babu : కృష్ణ దశదినకర్మకు హాజరయిన రమేశ్ బాబు కూతురు, కొడుకు
అయితే.. ఇటీవల కృష్ణ దశదినకర్మను మహేశ్ బాబు కుటుంబ సభ్యులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయన దశదిన కర్మకు రమేశ్ బాబు కూతురు, కొడుకు కూడా హాజరయ్యారు. అక్కడ రమేశ్ బాబు కూతురును చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే.. రమేశ్ బాబు కూతురు భారతి చాలా అందంగా ఉంది. తను అచ్చం హీరోయిన్ గా ఉండటంతో తనను కూడా ఇండస్ట్రీకి రావాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. తన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఆ ఫోటోలను చూసి అచ్చం చిన్నాన్న పోలికే. మహేశ్ బాబు అందమే వచ్చినట్టుంది అంటూ తెగ పొగిడేస్తున్నారు.