Mahesh Babu : తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబును గ్రీకువీరుడుగా పోల్చే అభిమానులు చాలామంది ఉన్నారు. అంతేకాక సిని సెలబ్రిటీలు కూడా మహేష్ బాబు అందం కొంచెం తమకు వచ్చి ఉంటే బాగుండని సరదాగా చెబుతుంటారు. అయితే ఈ వయసులో కూడా మహేష్ లా ఉండటానికి గల కారణం…జీన్స్ తో పాటు ఆయన కష్టమని చెప్పాలి. ప్రతిరోజు డైట్ ఫాలో అవుతూ జిమ్ అండ్ వర్క్ ఔట్స్ క్రమం తప్పకుండా చేస్తూ ఎప్పుడు ఒకే ఫిజిక్ ను మెంటైన్ చేసేందుకు చాలా కష్టపడతారు. అందుకే ఎప్పుడు చూసినా మహేష్ బాబు ఫిట్ అండ్ గ్లామర్ గా కనిపిస్తారు.
ఇక మహేష్ బాబు చేసే వర్కౌట్ సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులలో కూడా స్పూర్తిని నింపుతాడు. అయితే తాజాగా మహేష్ బాబు వర్కౌట్ చేస్తున్న ఫోటోను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.తన ఆర్మ్స్ ను ఎక్స్పోర్ట్ చేస్తూ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోటో లో మహేష్ కనిపించాడు.ఇక ఆ ఫోటోకి క్యాప్షన్ గా హార్డ్ వర్క్ విషయానికొస్తే నలుపు తెలుపు అంటూ ఏం లేదని , దానిని మెరుగ్గా తీర్చిదిద్దడం అంటూ రాస్కొచ్చారు. ఇక ఈ ఫోటో లో , మహేష్ బాబు బైసప్ చాలా పెద్దగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అనంతరం రాజమౌళి తో మహేష్ బాబు సినిమా చేయనున్నారు.ఈ క్రమంలోనే రాజమౌళి సినిమాలో ఫిజిక్ కోసం తెగ కష్టపడుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాను చేస్తున్న వర్కౌట్స్ ఏ సినిమా కోసం కాదని, తాను రెగ్యులర్ గా చేసే వర్కౌట్స్ చేస్తున్నానని ఈమధ్య మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఇక గుంటూరు కారం సినిమా విషయానికొస్తే…ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇక ఈ సినిమాలో శ్రీలీల , మీనాక్షి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram