Meena : ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ మీనా. ఆమె ఈ మధ్యకాలంలో ఆర్గాన్ డొనేట్ పై ఒక నిర్ణయం తీసుకున్నట్టు మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ఆర్గాన్ డొనేట్ యొక్క గొప్పతనం గురించి తెలియజేసి అందర్నీ కూడా ఇలాంటి ఆర్గాన్ డొనేట్ చేయాలి అని కోరింది. ఆమె భర్త సాగర్ ఈమధ్య కాలంలో అనారోగ్య సమస్యలతో మరణం పొందిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకి నివాళ్లు అన్నట్లుగా ఈమె ఆర్గాన్ డొనేట్ పై అందరికీ అవగాహన తెలియజేసే కార్యక్రమం స్టార్ట్ చేసింది.
Meena : ఆర్గాన్ డొనేట్ పై మీనా విజ్ఞప్తి చేస్తుంది.
ప్రాణాలు కాపాడేందుకు ఆర్గానిక్ డొనేట్ చాలా గొప్ప మార్గం. ఇది అందరికీ ఓ గొప్ప వరం అని మీనా తెలియజేస్తుంది. ఒక వ్యక్తి ఎనిమిది మందికి ఆర్గాన్ డొనేట్ చేసి వారి ప్రాణాలను రక్షించవచ్చు. కాబట్టి అందరూ కూడా ఆర్గాన్ డొనేట్ కి ముందుకి రావాలని మీనా విజ్ఞప్తి చేశారు. ఆర్గాన్ డొనేట్ అనేది అవయవం తీసుకునేవారు ఇచ్చేవారు మధ్య మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి నడుమున స్నేహబంధం కలగజేస్తుంది. అంతేకాకుండా సమాజంలో అందరికీ దారి చూపించినవారు అవుతారు.

నేను ఈరోజు ఆర్గానిక్ డొనేట్ చేసేందుకు మాట ఇస్తున్నాను మీరు కూడా నాతో ఆర్గాన్ డొనేట్ కు మాట ఇవ్వండి అంటూ మీనా . విజ్ఞప్తి చేశారు. ఆమె భర్త 28వ తారీకు మరణం పొందినట్లు అందరికీ తెలిసిన విషయమే అయితే ఆయన మరణం సమయంలో ఎన్నో రూమర్స్ చెక్కర్లు కొట్టాయి. ఆ రోమర్సు కు మీనా సోషల్ మీడియా ద్వారా ఆగ్రహంగా సమాధానం ఇచ్చింది.