Mike Tyson : లైగర్ సినిమాకు అంత హైప్ రావడానికి కారణం విజయ దేవరకొండ ఒకరు అయితే.. మరొకరు మైక్ టైసన్. మైక్ టైసన్ ఎవరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సింగ్ లెజెండ్ ఆయన. ఎందరో మహామహులను బాక్సింగ్ లో ఓడించిన ఘనత మైక్ టైసన్ కు దక్కుతుంది. ఒక మైకెల్ జాక్సన్ ఎలాగో.. మైక్ టైసన్ కూడా అలాగే. ఆయన హాలీవుడ్ లో కొన్ని షోలలో, సినిమాల్లో అడపాదడపా కనిపిస్తున్నాడు కానీ.. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు నటించలేదు. తాజాగా ఆయన ఇండియన్ సినిమాలో నటించాడు. అదే లైగర్.

నిజానికి.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అంతా భావించారు కానీ.. లైగర్ సినిమా ఫ్లాప్ అయింది. సినిమాకు పెట్టినంత కూడా రాలేదు. ఆ సినిమాలో మైక్ టైసన్ కు తగినంత పాత్ర ఇవ్వలేదని.. అసలు మైక్ టైసన్ ను ఈ సినిమాలో తీసుకొని అవమానించారంటూ సోషల్ మీడియా వేదికగా సినిమా యూనిట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు. అవన్నీ పక్కన పెడితే అసలు లైగర్ సినిమాలో నటించిన విషయాన్నే మైక్ టైసన్ మరిచిపోయాడట. అవును.. మీరు నమ్మరు కదా.. సినిమా విడుదల కాకముందే ఓ పాడ్ కాస్ట్ లో టైసన్ పాల్గొన్నాడు. తన స్నేహితులతో కలిసి మైక్ ఆ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నాడు.
Mike Tyson : లైగర్ అంటే టైగరా అన్న మైక్ టైసన్
అప్పుడు అతడి ఫ్రెండ్స్ బాలీవుడ్ మూవీ లైగర్ లో నటిస్తున్నారు కదా.. అందులో మీ పాత్ర ఏంటి అని ప్రశ్నించారు. దీంతో మైక్ కన్ఫ్యూజ్ అవుతాడు. బాలీవుడ్ మూవీనా. ఏం మాట్లాడుతున్నారు మీరు. నేను నటించడం ఏంటి అన్నట్టుగా చూస్తాడు టైసన్. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ లైగర్ లో నటిస్తున్నాడు అంటూ తన ఫ్రెండ్ చెబుతాడు. దీంతో యూ మీన్ టైగర్ అంటాడు మైక్ టైసన్. లైగర్ తో ఎప్పుడైనా పోటీ పడ్డారా అని తన ఫ్రెండ్ అడగగా… టైగర్ కు ఎదురుపడితే అది రెండు సెకన్లలో మనల్ని చంపేస్తుంది అని చెప్పాడు మైక్. దీన్ని బట్టి చూస్తే లైగర్ లో తను నటించినట్టు మైక్ టైసన్ కు అస్సలు ఏం గుర్తుకు లేనట్టుంది. ఈ వీడియో సినిమా రిలీజ్ కాకముందే తీసినప్పటికీ.. అప్పటికే మైక్ టైసన్ షూటింగ్ పార్ట్ కూడా పూర్తయిందట. అయినా కూడా తాను లైగర్ సినిమాలో నటించినట్టు తెలియకపోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు మైక్ టైసన్ ను ఈ సినిమా కోసం ఎలా ఒప్పించారు అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.