Mrunal thakur : మృణాల్ ఠాకూర్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ ‘ సీతారామం ‘ హీరోయిన్ అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు తెలుగు ప్రేక్షకులు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాలో హీరోయిన్ గా చేసింది మృణాల్. ఈ సినిమాను హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. అశ్వినీ దత్ నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో రష్మిక మందన, తరుణ్ భాస్కర్, సుమంత్ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 5న రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. సీతారామం సినిమాతో మంచి గుర్తింపుని తెచ్చుకుంది ఈ అమ్మడు. నటనకు, అందానికి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు.
ఈ సినిమా హిట్ అవడంతో ఆమెకి తెలుగులో పెద్ద ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది. సీతారామం సినిమా హిట్ అవడంతో ఇప్పుడు మృణాల్ కు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించబోతున్న ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి మృణాల్ ఠాకుర్ ని దాదాపుగా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా సీతారామం సినిమాను నిర్మించిన వైజయంతి సంస్థ మరోసారి హీరోయిన్ గా మృణాల్ కు అవకాశం ఇచ్చిందంట. ఈ సినిమాలో ఓ యంగ్ హీరో నటించనున్నారంట. ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు.
Mrunal thakur : ఎన్టీఆర్ కు జోడిగా మృణాల్…

ఇక మృణాల్ వ్యక్తిగత విషయానికొస్తే ఆమె ఆగస్టు ఒకటి 1992 ను మహారాష్ట్రలో జన్మించింది. ముంబై లోని కేసీ కాలేజీ నుండి మాస్ మీడియా చదివారు. మృణాల్ ఠాగూర్ జీ టీవీ సోప్ ఒపేరా కుంకుమ భాగ్యలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. సినీ కెరీర్ విషయానికొస్తే ఈ అమ్మడు 2014లో మరాఠీ సినిమా ‘ విట్టి దండు ‘ తో సినీ రంగ ప్రవేశం చేసింది. 2012లో అంతర్జాతీయ చిత్రం ‘ లవ్ సోనియా’ లో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించింది. హిందీలో 2019లో విరాట్ కోహ్లీ బయోపిక్ సూపర్ 30లో నటించి బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. ఇక 2020లో ఠాగూర్ నైట్ ఫ్లెక్స్ అంథలాజీ గోస్ట్ స్టోరీస్ లో మంచి పాత్రలో మెరిసింది. అదే సంవత్సరం జాన్ అబ్రహంతో కలిసి గల్లంతూర్ అని మ్యూజిక్ వీడియో లో కనిపించారు.