Mrunal Thakur : సీతారామం సక్సెస్ తో వరుస ఆఫర్లు… టాలీవుడ్ లో దూసుకెళుతున్న మృణాల్ ఠాకూర్…

Mrunal Thakur : హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘ సీతారామం ‘ సినిమాలో హీరోయిన్ గా మృనాల్ ఠాకూర్ నటించింది. ఈ సినిమాను హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో రష్మిక మందన మరో కీలక పాత్రలో పోషించారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ తో దూసుకెళుతోంది. ఈ సినిమా సక్సెస్ వలనే మృనాల్ ఠాకూర్ కి వరుసగా సినీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ అమ్మడు ముందుగా బుల్లితెరలో సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత మరాఠీ ‘ విట్టి దండు ‘ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత మరాఠీ తో పాటు హిందీలో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

Advertisement

తెలుగులో తొలిసారి నటించిన ‘ సీతారామం ‘ సక్సెస్ తో ఈమెకు వరుసగా సినీ ఆఫర్లు వస్తున్నాయి. స్టార్ హీరోలు కూడా ఈమెతో సినిమా చేయటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మృనాల్ ఠాకూర్ నటించిన ‘ సీతారామం ‘ సినిమా మంచి హిట్ ను అందుకుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం లో కూడా విడుదల చేశారు. ఇప్పటికే 50 కోట్ల వసూళ్లతో దూసుకెళ్లిపోతుంది ఈ సినిమా. మృనాల్ ఠాకూర్ సీతారామం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు క్లీవేజ్ తో రచ్చ చేయడం అప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నేటిజెన్లు ఆమెపై రకరకాలుగా కామెంట్స్ చేశారు.

Advertisement

Mrunal Thakur : టాలీవుడ్ లో దూసుకెళుతున్న మృణాల్ ఠాకూర్

Mrunal Thakur got many big film offers in tollywood industry
Mrunal Thakur got many big film offers in tollywood industry

ఈ అమ్మడు తొలిసారి హిందీలో ‘ లవ్ సోనియా ‘ సినిమాలో నటించింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ నటించిన ‘ సూపర్ 30 ‘ సినిమాలో నటించి మంచి పేరును దక్కించుకుంది. తుఫాన్, ధమాకా సినిమాలో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు షాహిద్ కపూర్ తో జెర్సీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో సీతారామం సినిమా ద్వారా దక్షిణాదిలో అడుగుపెట్టింది. సీతారామం సక్సెస్ తో ఆమెకి ఇప్పుడు వరుసగా సినీ ఆఫర్లు వస్తున్నాయి. స్టార్ హీరోలు ఆమెతో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

Advertisement