Naga Chaitanya : ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నాగచైతన్య. అక్కినేని వారసుడిగా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఈ మధ్యనే నాగచైతన్య బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. నాగచైతన్య నటించిన ‘ లాల్ సింగ్ చడ్డా ‘ సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించగా చైతు కీలక పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో బోడి బాలరాజు పాత్రలో చైతు నటించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నాడు.
తన నటనతో తెలుగు ప్రేక్షకులను కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ ముందు బాయ్ కాట్ సెగ తగిలింది. దాంతో ఈ సినిమాపై నెగెటివిటీ ఎక్కువై సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపించింది. ఇదిలా ఉంటే చైతు ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీగా ఉన్నాడు రిలీజ్ కి ముందు కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చాడు ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే చైతు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో చైతుకి నేపాటిజం గురించి ప్రశ్న ఎదురయింది. దీంతో చైతు బదులుగా నార్త్ తో పోల్చుకుంటే సౌత్ లో అది అంతగా కనిపించదు అని అన్నాడు చైతు.
Naga Chaitanya : ఆ విషయంలో వాళ్లతో పోల్చుకుంటే మన వాళ్లు చాలా బెస్ట్…

మా తాత, మా నాన్న ఇద్దరు హీరోలే వాళ్లని చిన్నప్పటినుంచి చూస్తూ పెరిగాను. వాళ్ల ప్రభావం నాపై ఖచ్చితంగా పడుతుంది కదా నాకు హీరో అవ్వాలను ఇంట్రెస్ట్ ఉంది. వాళ్లను ఇన్స్పిరేషన్ గా తీసుకొని హీరో అయ్యాను. ఇప్పుడు నా పని నేను చేసుకుంటూ పోతున్నా అని చెప్పుకొచ్చారు చైతన్య. అలాగే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని హీరో సినిమా, నా సినిమా ఒకే రోజు విడుదల అయితే ఆయన సినిమా 100 కోట్లు వసూలు చేస్తే నా సినిమా 10 కోట్లు వస్తే అందరూ ఆయనని ప్రశంసిస్తారు. దర్శక నిర్మాతలు ముందు ఆయన దగ్గరికే వెళతారు. అంతేకానీ నేను స్టార్ హీరో కొడుకుని నా దగ్గరికి రారు అంటూ చెప్పుకొచ్చాడు చైతన్య.