Naga Chaitanya : నాగచైతన్య ఈమధ్యనే బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. అక్కడ తన తొలి చిత్రం ‘ లాల్ సింగ్ చడ్డా ‘ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో చైతు పాత్రకు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాలో బాలరాజు గా చైతు అద్భుతంగా నటించాడు అంటూ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇక ఈ సినిమా విడుదలకు ముందే నుంచే చైతన్య వరుస ఇంటర్వ్యూ లతో బిజీ అయినా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలపై చైతు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా సంతరించుకున్నాయి.
దీనివలన అతడు కామెంట్స్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఛానల్ తో ముచ్చటించిన చైతుకి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన చైతు. దీంతో భవిష్యత్తులో అక్కడ హీరోగా చేస్తే ఏ హీరోయిన్స్ తో కలిసి నటించాలని ఉంది అని ప్రశ్న ఎదురయింది. దీనికి బదులుగా చైతు అలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా ల పేర్లు చెప్పాడు. అనంతరం ఇంకా చాలామంది హీరోయిన్లు ఉన్నారు. వారందరితో కలిసి పనిచేయాలని ఉంది. అందులో ముఖ్యంగా అలియాభట్ నటన అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ హర్ యాక్టింగ్.
Naga Chaitanya : ఆ హీరోయిన్ అంటే క్రష్…

ఒకవేళ అలియా భట్ తో నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను అంటూ తన మనసులో మాట చెప్పాడు. ‘ మనం ‘ సినిమా హిందీలో రీమేక్ అయితే తన పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందని అడగ్గా రణబీర్ చేస్తే బాగుంటుందని సమాధానం ఇచ్చాడు. ఇక సెలబ్రిటీ క్రష్ ఎవరని అడగగా మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ అని బదులిచ్చాడు. కాదా అద్వైత్ చందన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విడుదల వారం రోజులు గడిచినప్పటికీ బాక్సాఫీస్ వద్ద 37.96 కోట్లు మాత్రమే వసూలు చేసింది.