Naga Chaitanya : సామ్ మీకు మళ్ళీ కలిస్తే ఎం చేస్తారు అని అడిగిన ప్రశ్నకు నాగచైతన్య షాకింగ్ ఆన్సర్….

Naga Chaitanya : నాగచైతన్య మరియు సమంత విడిపోయిన తర్వాత వారిపై ఎన్నో రకాల వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే సమంత ఇంకా నాగచైతన్య ఇలాంటివి పట్టించుకోకుండా వారి వారి జీవితాల్లో బిజీ అయిపోయారు. నాగచైతన్య లాల్ సింగ్ చద్ధా సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. అదేవిధంగా సమంత చేతినిండా సినిమాలతో తన కెరీర్లో దూసుకుపోతూ ఉంది. వీరిద్దరూ తమ ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ గా దూసుకొని పోతున్నారు.

Advertisement

లాల్ సింగ్ చద్దా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపైన ప్రమోషన్ లో భాగంగా నాగచైతన్య తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మీరు సమంతాన్ని మళ్లీ కలవాల్సి వస్తే ఏం చేస్తారు అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు చైతన్య. ఆ ఇంటర్వ్యూలో రాపిడ్ ఫెయిర్ లో తనను ఈ ప్రశ్న అడగగా చాలా కూల్ గా తనకి హాయ్ చెప్తా అని చెప్పాడు. అలాగే తమ ప్రొఫెషనల్ లైఫ్ మరియు పర్సనల్ లైఫ్ వేరువేరుగా చూస్తానని.

Advertisement

Naga Chaitanya : నాగచైతన్య షాకింగ్ ఆన్సర్….

nagachithanya shocking reply on samantha
nagachithanya shocking reply on samantha

కొంతమంది ప్రొఫెషనల్ మరియు పర్సనల్ లైఫ్ ని తో ఒకదాన్ని ఒకటి కనెక్ట్ అవుతూ ఉంటారని. అలా ఉండడం వల్ల జీవితంపై చాలా ప్రభావం పడుతుందని. తను వృత్తిపరమైన జీవితాన్ని మరియు వ్యక్తిగత జీవితాన్ని వేరువేరుగా చూస్తానని ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మరియు కరీనాకపూర్ తో నటించిన నాగచైతన్య తన అనుభవాలని ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన అనేక విషయాలను నాగ చైతన్య వివరించారు.

Advertisement