Nagarjuna : “ఘాొస్ట్ అంటే దెయ్యం కాదు పోలీస్ ఏజెంటుకి కోడ్” అక్కినేని నాగార్జున.

Nagarjuna : అక్కినేని నాగార్జున గారు కొత్త మూవీ తో వస్తున్నారు అంటే తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు. ఆ మూవీలో అక్కినేని నాగార్జున గారి పాత్ర ఎలా ఉంటుందో ఆ పాత్రలో తను ఎలా కనిపిస్తాడో అని చాలామంది చాలా ఊహించుకుంటారు. అలాంటిది ‘ది ఘాొస్ట్’ అనే మూవీలో నాగార్జున గారు సరికొత్త పాత్ర చేయబోతున్నారు ఇది యాక్షన్ సీక్వెన్స్ మూవీ అని తెలుస్తుంది.ఈ మూవీకి ప్రవీణ్ సత్తారుగారు డైరక్షన్ చేయబోతున్నారు.

Advertisement

గతంలో ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు అని నాగార్జునగారు తెలియజేశారు. మూవీ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఘాొస్ట్ అంటే దెయ్యం కాదు పోలీస్ ఏజెంటుకి కోడ్ నేమ్ అని చెప్పుకొచ్చారు నాగార్జున గారు. ది ఘాొస్ట్ అనే మూవీలో ఎమోషన్తోపాటు, చెల్లెలి సెంటిమెంట్ కూడా ఉంటుంది అని తెలిసింది. ఈ మూవీ అక్టోబర్ 5 న విడుదల చేస్తాం అని చిత్రబృందం చెప్పుకొచ్చారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో నాగార్జున గారిని ఒక రిపోర్టర్ అడుగుతారు శివ మూవీలో చైను పెట్టారు ది ఘాొస్ట్ మూవీలో రెండు కత్తులు పెట్టారు అదీ ఇదీ ఒకటేనా సార్ అని అడుగుతారురిపోర్టర్.

Advertisement

Nagarjuna : ఘాొస్ట్ అంటే దెయ్యం కాదు పోలీస్ ఏజెంటుకి కోడ్

nagarjuna the ghost movie updates 
nagarjuna the ghost movie updates

అలా ఏం లేదు ఈ మూవీలో కత్తులు అనేది అవసరం అందుకే అలా పెట్టాల్సి వచ్చింది అని నాగార్జున గారు నవ్వుతూ సమాధానం ఇస్తారు .ఈ మూవీలో చాలా స్టైలిష్గా యాక్షన్ ఉంటుంది అందుకోసం అలా అవసరం పడింది అని చెప్తారు. విక్రమ్ అనే మూవీ తో ఇండస్ట్రీ కి పరిచమైన నాగార్జున గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నాగార్జున గారు ఒక్కొక్క సినిమా కి ఒక్కొక్క పాత్రలో తనదైన శైలిలో తన నటన నిరూపిస్తూనే ఉన్నారు. ఇక మూవీ అని మాత్రమే కాకుండా ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ అందరినీ అలరిస్తూ ఉంటారు. బిగ్ బాస్ షోకు హోస్ట్ గా తన యాంకరింగ్ ఎంత బాగా చేసారో అందరికీ తెలిసిన విషయమే.

తన నటనతో అక్కినేని నాగార్జున గారు అందరి అమ్మాయిల మనసులలో మన్మథుడిగా నిలిచిపోయాడు. నాగార్జున గారు ఈ వయసులో కూడా చాలా యంగ్, అండ్ స్టైలిష్ గా కనిపిస్తూ తన ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు.ఏ మూవీకి అయినా సరే తన నటన నిరూపించుకోవడం కోసం తన బాడీని ఎప్పుడూ ఫిట్ గా వుంచుకుంటారు. ఏది ఏమైనా సరే ‘ది ఘాొస్ట్’ అనే మూవీలో నాగార్జున గారు యాక్షన్ తో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీ నాగార్జున గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టాలని తన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

Advertisement