Balakrishna : తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ క్రేజ్ ఎలాంటిదో మాటల్లో చెప్పాల్సిన పనిలేదు. ఈయన తీసిన ప్రతి సినిమా కూడా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును ఏర్పరుస్తుంది. ఇక సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ హీరోలు ఉన్నప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వచ్చేది ఒక్క బాలయ్య అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఇటీవల అఖండ మరియు వీరసింహారెడ్డి వంటి సినిమాలతో వరుసగా రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు. ఈ నేపద్యంలో ఇటీవల చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా సినీ బృందం మాట్లాడుతూ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాపై అభిమానులు పెంచుకున్న అంచనాలన్నీ కచ్చితంగా రీచ్ అవుతుందంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం బాలయ్య బాబు మాట్లాడుతున్న సందర్భంలో విగ్గు ప్రస్తావన రావడం జరిగింది. ఈ క్రమంలో తాను సూటింగ్ టైం లో లేదా లొకేషన్ లో ఉన్నప్పుడు షాట్ కు షాట్ కు గ్యాప్ దొరికితే చాప వేసుకుని కింద పడుకునేవాడినని అలాగే విగ్గు తీసి పక్కన పెట్టేవాడని చెప్పుకొచ్చాడు. ఇక ఆ సమయంలో ఒకడు బాలయ్య బాబును మీరు విగ్గు వాడతారా అని అడిగాడట.
ఇక దీనికి బాలయ్య గడ్డానికి వెంట్రుకలు నువ్వు ఎక్కడ నుంచి తీసుకుని పెట్టుకున్నావు అంటూ సమాధానం ఇచ్చానని తెలియజేశారు. బాలయ్య ఈ విషయాన్ని చెబుతూ మన దగ్గర దాపరికాలు ఉండవు మనం ఓపెన్ బుక్ అంటూ ఓపెన్ గా చెప్పాడం జరిగింది. ఈ క్రమంలో బాలయ్య మాటలకు అభిమానులు ఫీదా అవుతున్నారు. బాలయ్య లోపల ఒకటి పెట్టుకుని బయటికి మరొక లాగా మాట్లాడరు అని ఏదైనా పేస్ట్ పేస్ అనేస్తాడంటూ చెప్పుకొస్తున్నారు. ఇది ఇలా ఉండగా భగవంతు కేసరి సినిమా హిట్ అందుకుంటే సీనియర్ హీరోలకి ఎవరికి సాధ్యం కాని రీతులో బాలయ్య హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. ఇక సినిమా థియేటర్లో బాలయ్య క్రేజ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే…