Nani : “అంటే సుందరానికి” అనే కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్న నాచురల్ స్టార్ నాని బయోగ్రఫీ

Nani : నాని 1984 ఫిబ్రవరి 24 న ఘంటా రాంబాబు – విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. నాని అసలు పేరు నవీన్ బాబు ఘంటా, నాని సొంత ఊరు కృష్ణా జిల్లా చల్లపల్లి, నాని తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా హైదరాబాద్ కి వచ్చి హైద్రాబాద్ లొ స్థిరపడ్డారు. నాని అక్క పేరు దీప్తి. నాని వాళ్ళ అమ్మగారు సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేస్తున్నారు, నాన్నగారు స్వశక్తితో పైకి వచ్చి ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు. నాని సుల్తాన్ ఉల్లాల్ స్కూల్ లో చదువుకునేటప్పుడు తన తోటి విద్యార్థులు అందరూ ముస్లిం వాళ్లు కావడంతో, నాని హిందూ సాంప్రదాయం ప్రకారం గుండు కొట్టించుకోవడం, బొట్టు పెట్టుకున్న నానిని చూసి తోటి విద్యార్థులు అందరూ ఎగతాళి చేసేవారు. నవ్వేవారు.కానీ నాని స్వతహాగా భయస్తుడు కావడంతో వాళ్లని నాని ఏమి అనేవాడుకాదు.

Advertisement

ఒక రోజు నాని సైకిల్ తొక్కుకుంటూ తోటి వాళ్లు క్రికెట్ ఆడుకుంటుండగా మధ్యలో సైకిల్ తొక్కాడని నాని సైకిల్ టైర్లలో గాలి తీసేశారు, అప్పుడు నాని మౌనంగా ఇంటికి వెళ్లాడు, జరిగింది తెలుసుకున్న నాని బాబాయ్, నానిని గ్రౌండ్ లొకి తోసి, గేట్ క్లోజ్ చేసి వాళ్ళు నిన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా పర్వాలేదు కానీ, నువ్వు ఒక దెబ్బకొట్టే రా అని చెప్పడం తో నాని ధైర్యం చేసి అందులో ఎగతాళి చేసిన వారిలో ఒకరిని క్రికెట్ బ్యాట్ తొ కొట్టాడు. అప్పటి నుండి నాని ధైర్యంగా ఉండడం మొదలుపెట్టాడు. నాని మొదట్లో హీరోగా నటించాలి అని అనుకున్నా తనకు అంత సీన్ లేదని నాని డైరెక్టర్ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టాలి అనుకున్నాడు.నాని మొదట రాధాగోపాలం సినిమాలో అసిస్టెంట్ డైరక్టర్ గా చేరాడు.తర్వాత 3 , 4 సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నానికి డైరెక్షన్ అంత సులభం కాదని అర్థం చేసుకున్నాడు.

Advertisement

Nani : నాచురల్ స్టార్ నాని బయోగ్రఫీ

natural star nani biography
natural star nani biography

నాని కి తన ఫ్రెండ్ నందిని రెడ్డి రేడియో జాకీ ఆఫర్ ఇచ్చింది,రేడియో జాకీగా పని చేస్తూ భాషపై పట్టు సాధించాడు నాని. యాడ్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడికి రావలసినవాళ్లు రాకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న నాని నాలుగు ముక్కలతో స్క్రిప్ట్ రాసి, యాక్ట్ చేసి చూపించాడు.అది వాళ్లకు విపరీతంగా నచ్చడంతో ఒరిజినల్ గా కూడా నానీనే నటించామని అన్నారట. యాడ్ ఫిల్మ్ ఎడిట్ చేస్తున్న సమయంలో అక్కడికి డైరెక్టర్ మోహనకృష్ణ వచ్చారు. యాడ్ ఫిల్మ్ లొ నటించిన నాని ని చూడగానే సినిమాలో హీరో అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు. అలా అష్టాచమ్మా సినిమాతో అనుకోకుండా నాని హీరో అయ్యాడు, అష్టాచమ్మా సినిమా మంచి పేరు తేవడంతో సినిమా అవకాశాలు చుట్టుముట్టాయి.

నానిని ఈగ సినిమాతో విమర్శల నుండి ప్రశంసలు ఎదుర్కున్నాడు నాని. ఈగ, ఎవడే సుబ్రమణ్యం, ఎంసీఏ ఇలా వరుసగా ఎనిమిది చిత్రాలతో విజయం సాధించి, రికార్డు సృష్టించాడు. నాని 2014 లో నిర్మాతగా డీ ఫర్ దోపిడీ అనే చిత్రాన్ని వ్యవహరించాడు. నాని కొన్ని సినిమాలతో అనుకున్నంత విజయం సాధించకపోయినా మళ్లీ నిలదొక్కుకున్నాడు. ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో మళ్లీ విజయాన్ని మొదలు పెట్టాడు నాని. జెంటిల్మన్, మజ్ను, నేను లోకల్, నిన్నుకోరి, దేవదాసు వంటి చాలా మంచి సినిమాల్లో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు, వరుసగా ఏడు టాలీవుడ్ సినిమాలు హిట్ కొట్టిన హీరో నాని. ఇప్పుడు నాని కొత్తగా “అంటే సుందరానికి “అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు ఈ సినిమా తనకు మంచి పేరు తెచ్చి పెట్టాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement