Nayanathara : తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరు నయనతార. తొలి సినిమా నుంచి ఇప్పటి సినిమాల దాకా నయనతార కి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే నయనతార జీవితంలో తొందరపడినట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఆమె సన్నిహితులు కూడా క్లారిటీ ఇచ్చారు. ఆమె తొందరపాటు నిర్ణయం వలన ఇకపై హీరోయిన్ పాత్రలు రాకపోవచ్చు అని సినీ పరిశ్రమలో ట్రాక్ వస్తుంది. దీంతో తల్లి, అక్క, ఆంటీ పాత్రలు మాత్రమే చేసుకోవాల్సింది వస్తుందని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతం నయన్ అటు తెలుగు, ఇటు తమిళం లో మంచి పాత్రలు చేస్తూ దూసుకెళుతోంది.
నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను జూన్ 9న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కామన్ గా హీరోయిన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకి దూరం అవుతారు. పెళ్లి, పిల్లల తర్వాత హీరోయిన్స్ కొంత లావు అవుతారు. ఫిట్నెస్ దెబ్బతింటుంది. దీంతో సినీ కెరీర్ ప్రమాదంలో పడుతుంది. వీరిని హీరోయిన్స్ గా తీసుకునేందుకు దర్శక నిర్మాతలు కూడా అంతగా ఆసక్తి చూపించరు. దీంతో అక్క, వదిన, అమ్మ పాత్రలతో రీఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది ఏకంగా వెండితెర మీద కనిపించే అవకాశం కూడా ఉండకపోవచ్చు.
Nayanathara : ఆమె రేంజ్ కి ఇలాంటి పాత్రనా…!

అయితే ఇక్కడ నయనతారకు కలిసొచ్చే విషయం ఏమిటంటే విగ్నేష్ శివన్ దర్శకనిర్మాత అవ్వడం, హీరోయిన్ గా కంటిన్యూ అవ్వడానికి నయనతార కి కలిసొస్తుంది. ఈ క్రమంలోనే ఆమె కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి కమిట్ అవుతుంది. తాజాగా విడుదలైన చిరంజీవి ‘ గాడ్ ఫాదర్ ‘ సినిమా టీజర్ చూస్తే అర్థమవుతుంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నయనతార కూడా ఇందులో ఓ పాత్రను పోషించింది. అయితే అది హీరోయిన్ పాత్ర కాదు. నయనతార రేంజ్ కి అలాంటి పాత్ర చేయాల్సిన అవసరం కూడా లేదు. అయినా ఆమె ఓకే చేసింది. దీని అంతటికీ పెళ్లే కారణమని అంతా అంటున్నారు.