Nayanthara : సినిమాలకు ఇక సెలవు…నయనతార లేటెస్ట్ పోస్ట్ వైరల్…

Nayanthara : సౌత్ లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సాధించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా స్టార్ హీరోయిన్ గా తన ఫామ్ ని కొనసాగిస్తూ వస్తుంది. అంతేకాక మదర్ గా , భార్యగా , బిజినెస్ ఉమెన్ గా, ప్రొడ్యూసర్ గా తన వంతు బాధ్యతలను నెరవేరుస్తూ కెరియర్ పరంగా దూసుకెళ్తోంది. అలాగే సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా రెమ్యూనిరేషన్ అందుకుంటున్న ఏకైక హీరోయిన్ గా నయనతార నిలిచింది. అయితే తాజాగా తన స్టార్ స్టేటస్ తో సక్సెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూనేమరో కొత్త టాలెంట్ బయట పెట్టేందుకు నయనతార ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

Image

Advertisement

అయితే తాజాగా నయనతార సోషల్ మీడియాలో “కొత్తగా ప్రారంభిస్తున్న” చూడండి అంటూ పోస్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇన్నాళ్లుగా కెమెరా ముందు నటించిన నయనతార ఇప్పుడు కెమెరా వెనుక నిలబడి లేటెస్ట్ ఫోటోతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. దీంతో నయనతార త్వరలోనే ఓ సినిమా డైరెక్ట్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్లు మంచి ఫామ్ లో ఉన్నప్పుడే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు అడుగులు వేశారు. ఇక ఇప్పుడు నయనతార కూడా దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఇదే జరిగితే నాయనతార ఇక సినిమాలలో నటించే అవకాశం ఉండదేమో. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో భారీ భారీ ప్రాజెక్టును చేస్తూ హిట్స్ మీద హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ ఏ రంగంలో దిగిన సక్సెస్ అవ్వడం ఖాయమని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే నయనతార భర్త విఘ్నేశ్ శివన్ కూడా దర్శకుడు అన్న విషయం మనకు తెలిసిందే.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో “అన్నపూరణి” అనే సినిమా చేస్తుంది. ఇక ఈ సినిమా నయనతారకు 75వ సినిమా కావడం విశేషం. దర్శకుడు నీలేస్ కృష్ణ తెరకేకిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement