Nazriya Nazim : క్యూట్ యాక్టరేస్ నజ్రియా నజీమ్ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతూ ఉంటుంది. బాలనటిగా మలయాళం పలుంకు అనే సినిమాలో అడుగు పెట్టింది. బాలనటిగా రెండు మూడు సినిమాల్లో చేసింది. ఈమె తమిళ్ సినిమా అయినటువంటి రాజ రాణీ సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులో డబ్ చేశారు. ఈ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులే కొట్టివేసింది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో రాజ రాణీ మూవీ లో టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన నటిగా గుర్తింపుపొందింది. నజ్రీయ తన యాక్టింగ్ కు తన అందానికి ఉత్తమనటి గా ఎన్నో పురస్కారాలను అందుకుంది.
ఈ మత్తు కళ్ల సుందరి ఇప్పుడు తెలుగులో నేచురల్ స్టార్ నాని తో కలిసి ‘అంటే సుందరానికి’ సినిమా ద్వారా తెలుగులో అడుగుపెడుతోంది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 10 న రిలీజ్ కానుంది. ఈ సందర్భం గా జరిగిన ప్రెస్ మీట్లో నజ్రియా సందడి చేసింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విజయాలు ప్రేక్షకులతో పంచుకుంది. తనది ప్రేమ వివాహం అని తెలిపింది. తన హస్బెండ్ ఫహద్ ఫాసిల్ గురించి ఎన్నో విషయాలు మీడియా ద్వారా తెలిపింది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘లీలాతామస్’ అనే అమ్మాయి కరాక్టర్లో నటించాను అని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తన పాత్రను చాలా బాగా రూపొందించాడు అని ఈ సినిమా చేయడం చాలా సంతోషం గా ఉంది అని మీడియా ద్వారా పంచుకుంది.
Nazriya Nazim : ఈ కైపు కళ్ల సుందరి టాలీవుడ్ పై చాలా ఆశలు పెట్టుకుంది

నజ్రీయా తనకు డాన్స్ సరిగా రాదు అని తను నాని ను సెట్స్ లో డాన్స్ చేస్దిది చూసి తాను కొద్దిగా జంకినట్లు చెప్పుకొచ్చింది. కానీ తరువాత కవర్ చేసుకొచ్చాను అని చెప్పింది. తను మంచి స్టొరీ దొరకక ఇన్నిరోజులు సినిమాలు చేయలేదు అని ఈ సినిమా స్టోరీ వినగానే తన భర్త ఫహద్ ఫాసిల్ వెంటనే ఒప్పుకున్నారు అని తనకు కూడా స్టొరీ చాలా నచ్చింది అని వివరించింది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెలుగులో తన భర్త చేసిన మూవీ అయినటువంటి పుష్ప మూవీ గురించి చెపుతూ చాలా బాగుంది అని తెలిపింది. తన హస్బెండ్ పాత్ర తనకు నచ్చింది అని చెప్పింది. తనకు తెలుగు ఇంకా చాలా సినిమాలు చేయాలని ఉంది అని ఎన్టీఆర్ మహేష్ బాబు రామ్ చరణ్ తో కలిసి సినిమాలు చేయాలని ఉందని మనసులో మాట చెప్పింది. దీన్ని బట్టి ఈ కైపు కళ్ల సుందరి టాలీవుడ్ పై చాలా ఆశలు పెట్టుకుంది అనిపిస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.