krithi Shetty : హీరోయిన్ కృతి శెట్టి ‘ ఉప్పెన ‘ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. ఈ యంగ్ బ్యూటీ నటనకు, ఆమె డాన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమా హిట్ తర్వాత కృతి శెట్టి వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటించింది. వీటిలో బంగార్రాజు సినిమా మాత్రమే ఘనవిజయం సాధించింది. మిగిలిన సినిమాలన్నీ ఆమెను నిరాశపరిచాయి. ఈ మధ్యనే రిలీజ్ అయిన నితిన్ ‘ మాచర్ల నియోజకవర్గం ‘ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. దీంతో కృతి శెట్టి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది.
జయపజయాలు ఎవరి చేతిలో ఉండవు. కానీ ఎంచుకునే కథలు స్ట్రాంగ్ గా ఉండాలి అంటూ కృతి శెట్టిని విమర్శిస్తున్నారు. ఆమెపై ఐరన్ లెగ్ ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం కృతి శెట్టి సుధీర్ బాబు కు జోడిగా ‘ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ‘ అనే సినిమాలో నటిస్తుంది. అలాగే సూర్య కు జోడిగా మరో సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు కెరీర్ పరంగా చాలా ముఖ్యం ఆమె ఎంచుకునే కథల విషయంలో ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నాయి. ఉప్పెన తర్వాత వచ్చిన ప్రతి సినిమా స్టోరీ వినకుండా ఓకే చేసినట్లు ఉంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు బేబమ్మ ఇక సినిమాలు చేసింది చాలు వెళ్లి చదువుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
krithi Shetty : పాపం ఇలా అయిందేంటి…

మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ రెండు సినిమాలు రొటీన్ కమర్షియల్ ఎంటర్టైన్స్. ఈ రెండు సినిమాల్లో కృతి శెట్టి కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. కేవలం రొమాంటిక్ ట్రాక్, సాంగ్స్ కి మాత్రమే పరిమితం చేశారు. ఇలాంటి స్టోరీలు ఎంచుకుంటే పరాజయాలు ఎదురవుతాయని విమర్శిస్తున్నారు. ఉప్పెన తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ గానే నిలిచాయి. దీంతో ఆమె స్పీడ్ కి బ్రేకులు పడ్డట్లే అని అంటున్నారు. ఇక నుంచి కృతి శెట్టి ఆచూ తూచి అడుగులు వేస్తూ కథని ఎంచుకోవాలి అని అంటున్నారు.