Intinti Gruhalakshmi 26 July Today Episode : సామ్రాట్ ఇంటికి వచ్చి, హనీ పాపని కృష్ణుడి గెటప్లో రెడీ చేసిన తులసి.

Intinti Gruhalakshmi 26 July Today Episode : 694 episode ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 26-july-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం..అభి ఇంటికి వచ్చి, తులసితో నువ్వెలాగో అంకితను కట్టిపడేశావు, అందుకే నేనే వచ్చాను, ఒక మెట్టు దిగి అని అంటాడు. అప్పుడు తులసి బంధాలలో ఒక మెట్టు ఎక్కడం, దిగడం అని ఉండదు. ఏదైనా తెగేదాకా లాగొద్దు, అలాచేస్తే నష్టమే వస్తుంది, అని చెబుతూ ఉంటుంది. ఇంతలో ప్రేమ కూడా వస్తాడు అక్కడికి. అందరూ సంతోషపడతారు. తులసి, శృతి ఎక్కడరా అని అడుగుతుంది. అప్పుడు ప్రేమ్ తాను రాలేదు అని సమాధానం చెప్పగానే, ప్రేమ్ వాళ్ళ నాన్నమ్మ కొంపదీసి మీరు గొడవపడ్డరా అని అడుగుతూ ఉంటుంది.

Advertisement

అప్పుడు తులసి ఎందుకు అత్తయ్య అలా అంటున్నారు, వాళ్ల మధ్య ఎప్పుడూ గొడవలు రావు అని అంటూ ఉంటుంది. ఎందుకంటే శృతి వాడిని అర్థం చేసుకుంటుంది అని ఇంతలో అభి అంటాడు.అప్పుడు తులసి ప్రేమ్, శ్రుతిని ఎప్పుడూ కష్టపెట్టేలా ప్రవర్తించాడు, అందుకే గొడవలు రావు అని అంటుంది.ప్రేమ్ తాతయ్య ఎక్కడ శృతి, మాట్లాడవు అని అనగానే ప్రేమ్ వాళ్ల కౌసల్య అత్తకి ఆరోగ్యం బాగాలేదు, తనకి సహాయంగా ఉందామని అక్కడికి వెళ్లింది అని అంటాడు. అప్పుడు తులసి శ్రుతి మంచి పనే చేసింది. ఇలాంటి సమయంలో తన తోడు అవసరం అని అంటుంది.

Advertisement

Intinti Gruhalakshmi 26 July Today Episode : సామ్రాట్ ఇంటికి వచ్చి, హనీ పాపని కృష్ణుడి గెటప్లో రెడీ చేసిన తులసి.

Intinti Gruhalakshmi 26 July Today Episode
Intinti Gruhalakshmi 26 July Today Episode

ఒకసారి శృతికి ఫోన్ చేయి ప్రేమ్ మాట్లాడదాం అని అంటుంది.అప్పుడు ప్రేమ్ ఇప్పుడే మాట్లాడాను అమ్మా, వాళ్ళు హాస్పిటల్ కి వెళుతున్నారు అంటా ఇంటికి రాగానే ఫోన్ చేస్తాను అంది అని చెబుతాడు.సరే మీరు వెళ్లి కొద్దిసేపు రెస్టు తీసుకోండి అని అంటుంది అభి, ప్రేమ్ తో తులసి.అందరూ చాలా సంతోష పడతారు, మ్యూజిక్ స్కూల్ ఓకే అయ్యింది, ఇద్దరు పిల్లలు తిరిగి వచ్చారని సంతోషపడుతూ ఉంటారు.తరువాత తులసి పిల్లలకు సంగీతం చెప్పడానికి పిల్లల దగ్గరికి వెళుతుంది. అప్పుడు హనీ పాప డల్లుగా పక్కన కూర్చొని ఉంటుంది.

అప్పుడు తులసి ఆ పాప దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ పాప చిల్డ్రన్స్ కాంపిటీషన్ ఉంది ఆంటీ నాకు కృష్ణుడి గెటప్ వేయమని చెప్పారు. నాకు హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. దానికి మీ ఇంట్లో తాతయ్య, నాన్న ఉన్నారు కదా అని అడుగుతుంది. అప్పుడు వాళ్లు నాకేమీ కావాలి అన్న కొనిస్తారు అంతే, వాళ్ళకి అవేమీ తెలియదు, మీరు నాకు హెల్ప్ చేస్తారా ప్లీజ్ అని అడుగుతుంది. అప్పుడు తులసి ఒప్పుకుంటుంది.తరువాత శృతికి, ప్రేమ్ ఫోన్ చేస్తాడు. శృతి ఫోన్ ఎత్తకుండా ఫోన్లో కాదు, డైరెక్టుగానే మాట్లాడతాను అని ఇంటికి వెళుతుంది.

అక్కడ టూలెట్బోర్డ్ ఉండడంతో పక్కన ఉన్న ఆవిడని అడుగుతుంది. ఆమె అదేంటి రూమ్ ఖాళీ చేసిన విషయం నీకు తెలియదా, మీ ఇద్దరు విడిపోయారా, అని ప్రశ్నలు అడుగుతూ ఉంటే, ఇంతలో వాళ్ల అత్తయ్య అక్కడికి వచ్చి మా శృతిని ఏమీ అడగవద్దు అని, ఇలా చేసాడు చూడు నా దగ్గర, ఈవిడదగ్గర అబద్ధం చెప్పాడు నీ విలువ తెలియదు తనకి ఎప్పటికీ, ఇలానే ఉంటే అని, చెప్పు నీ ఇష్టం అక్కడికే వెళదాం అంటే దింపుతాను వాళ్ళింటిముందు అని అంటుంది. అప్పుడు శృతి లేదు అత్తయ్య మన ఇంటికి వెళదాం అని అంటుంది. తరువాత లాస్య, నందుతో అసలు ఆ సామ్రాట్ సీఈవో ఎలా అయ్యాడు నాకింకా అర్థం కావటం లేదు.

నువ్వు ఓకే చేసిన సాఫ్ట్వేర్ ఐడియాని కాదని, ఆ తులసి సంగీతం ఐడియాని ఓకె చేసాడు అని అనడంతో, అప్పుడు నందు మరీ తులసి ఐడియా కూడా అంత చండాలంగా లేదు కదా, బానే ఉంది కదా అని అంటాడు, అప్పుడు లాస్య ఐడియా కాదు, తులసీ నచ్చి అలా ఓకే చేశాడు, అని తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది లాస్య. అప్పుడు నందు, తులసి అలాంటిది కాదు అని అనగానే, తులసి కాదు కానీ సామ్రాట్ అలాంటివాడే అని, కొద్దిసేపు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో లాస్య కొడుకు అక్కడికి వచ్చి మమ్మీ రేపు కాంపిటీషన్ ఉంది నాకు,ఎ గెటప్ వేయాలో అంతా నువ్వే హెల్ప్ చెయ్యాలి అని అనగానే, ఇక్కడ నాను పెద్ద ప్రాబ్లమ్ ఉంటే, నీ గోల ఏంటి అని కోపంగా మాట్లాడుతుంది.

ఇంతలో నందు కోపం వాడిమీద చూపిస్తావు ఎందుకు అని, నేను హెల్ప్ చేస్తాను అని అంటాడు. అప్పుడు లాస్య కొడుకు థాంక్స్ అంకుల్ అని అంటాడు. తర్వాత హనీ పాపని కృష్ణుడి గెటప్లో తయారుచేయడానికి సామ్రాట్, ఇంట్లో వాళ్లు ఎంతో ప్రయత్నిస్తారు, కానీ సరిగ్గా సెట్ అవ్వదు. ఇంతలో నందు, లాస్య అక్కడికి వస్తారు. అప్పుడు సామ్రాట్ ఏంటి అని అనగానే, మ్యూజిక్ ప్రాజెక్టు రెడీ చేసాను మీకు చూపిద్దామని వచ్చాను అని నoదు అంటాడు. అప్పుడు సామ్రాట్ ఉదయం నుంచి నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను కానీ అవ్వడం లేదు అని పాపవైపు చూస్తూ అంటూ ఉంటాడు.

అవును నువ్వు వచ్చావు కదా లాస్య పాపకి గెటప్ వెయ్యి అని అనగానే, నాకు మేకప్ వేసుకోవడం తప్ప ఇలాంటి గెటప్స్ రావు సార్ అని అంటుంది. అప్పుడు పాప మీ వల్ల కాదని నేను ముందే తులసి ఆంటీని రమ్మన్నాను అని అంటుంది. ఇంతలో తులసి అక్కడికి వస్తుంది. ఏంటి ఇలా రెడీ చేసారు అని అనగానే, ఆంటీ మీరు రావడం ఆలస్యమైతే నన్ను కృష్ణుడిలా కాదు, ఆంజనేయస్వామిలా రెడీ చేసే వాళ్లు అని అంటూ ఉంటుంది.

నాకు ఆటో దొరకలేదు అమ్మా అని తులసి అనగానే, అప్పుడు సామ్రాట్ పాపతో నాకు ముందే చెప్పి వుంటే నేను కారు పంపించేవాణ్ని కదా, ఆంటీని ఎందుకు ఇబ్బంది పెట్టావు అని అంటూ ఉంటారు. అప్పుడు తులసి పర్వాలేదు అండీ అని, ఐదు నిమిషాల్లో నేను పాపని రెడీ చేస్తాను అని అంటుంది. అప్పుడు పాప ఇక్కడొద్దు లోపలికి వెళదాం పద ఆంటీ అని లోపలికి తీసుకొని వెళుతుంది.తరువాత సామ్రాట్ లాస్యతో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను,నీ గురించి నేను చాలా ఎక్స్ పెక్ట్ చేశాను, కృష్ణుడి గెటప్ వేయడం రాకపోతే ఎలా అని, ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకి, వాళ్ల తండ్రులు కృష్ణుడి గెటప్ వేసీ, ఫోటోస్ అప్లోడ్ చేస్తున్నారు,

అవును నీకు పిల్లలు లేరా అని అడుగుతాడు, అప్పుడు లాస్య నేను పెళ్లి కాకముందే జాక్ చేసేదాన్ని, నాకు ఎప్పుడు చూసినా జాబ్, హడావిడి టైం దొరికేది కాదు అని ఉంటుంది. అప్పుడు సామ్రాట్ ఇవన్నీ మనకు మనం సర్దిచెప్పుకోడానికి చెప్పే సాకులు అని, ఏమంటావ్ బాబాయ్ అని అంటూ,దేనికైనా మనసుంటే మార్గముంటుంది. అటు గృహణి బాధ్యతల్ని, ఆఫీస్ బాధ్యతల్ని ఎంత మంది ఆడవాళ్లు బ్యాలెన్స్ చేయడం లేదు అని అంటూ ఉంటాడు.

ఇంతలో పాపని రెడీ చేసుకొని తులసి వస్తుంది. పాపని చూసి సామ్రాట్ స్వామీ నా జన్మ ధన్యమైంది అనగానే, ఏం వరం కావాలో కోరుకో అని పాప అంటుంది. అప్పుడు ఈరోజు రెడీ చేసినట్టు, రేపు డ్యాన్స్ కూడా నేర్పించమని మీ తులసి ఆంటీని నా బదులు నువ్వే రిక్వెస్ట్ చేయి, నా భారాన్ని దిoచు అని అనగానే, అప్పుడు తులసి నాకు అంత డాన్స్ రాదు అని అంటూ ఉంటుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement