NTR 30 Movie : నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ 30 తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం డైరెక్టర్ కొరటాల శివ 100 కోట్ల బడ్జెట్తో సినిమా తీయబోతున్నట్లుగా సమాచారం. అయితే కొరటాల శివ ఆచార్య సినిమా దారుణమైన పరాజయం తర్వాత ఎన్టీఆర్ 30 సినిమా విషయంలో కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. ఒకానొక సమయంలో ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఇది భారీ బడ్జెట్ సినిమా కావడంతో నటీనటుల ఎంపిక విషయం ఇంకా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు.
కావున ఈ సినిమాకి ఎక్కువ సమయం తీసుకుంటుంది అని కాకుండా కద విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అయితే మొదట అనుకున్న కథ ప్రకారం ఈ సినిమా తెరకు ఎక్కాల్సి ఉండగా ఈ స్టోరీని తర్వాత ఎన్టీఆర్ చేయబోయే భారీ పాన్ ఇండియా సినిమా కోసం ఎంచకున్నట్లుగా సమాచారం. కాగా ఎన్టీఆర్ 30 కోసం మరో స్టోరీ ను కొరటాల శివ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మరో నిర్మాత అయిన సుధాకర్ ఇటీవల మాట్లాడుతూ సినిమాని ఏకంగా తొమ్మిది భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లుగా చేశారు. పాన్ ఇండియా సినిమా సినిమా అంటే సౌత్ లో నాలుగు భాషల్లో మరియు నార్త్ లో హిందీలో రిలీజ్ చేయడం సాధారణంగా జరుగుతుంది.

NTR 30 Movie : మరి ఓవర్ గా లేదా ఇది…
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ 30 ఏకంగా తొమ్మిది భాషల్లో రిలీజ్ చేయడం కాస్త ఓవర్ గా ఉందంటూ నందమూరి అభిమానులు స్వయంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాని తొమ్మిది భాషల్లో పది భాషల్లో వీడియోలు చేయాల్సిన అవసరం లేదు ఐదు భాషల్లో తీసి సక్సెస్ చేసేసారు భారీ నమోదు అవుతాయని నిర్మాతలకు చురకలాంటిస్తున్నారు నందమూరి అభిమానులు. ఆయన చెబుతున్న ప్రకారం ఈ సినిమా నవంబర్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చూస్తే ఈ సినిమా వచ్చే సంవత్సరం చివర్లో కానీ ప్రేక్షకుల ముందుకి రాదు అని సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.