Poorna : ఎవరికి తెలియకుండా నిశ్చితార్థం చేసుకునకొని అందరినీ ఆశ్చర్య పరిచిన బ్యూటీ…

Poorna : పూర్ణ, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన హీరోయిన్. ఈమె కేరళ నుంచి వచ్చి తెలుగు లో స్థిరపడింది. ఈమె తెలుగులో 2016లో జయమ్ము నిశ్చ‌య‌మ్ము రా సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసింది. అవును, అవును2 మూవీస్ లో నటించింది. ఈ హార్రర్ సినిమాలలో నటించి అందరినీ అలరించింది. అలా అలా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ మధ్య కాలం లో బ్యక్ డోర్, అఖండ వంటి చిత్రాల్లో కనిపించి అందరినీ అలరించింది. దాదాపు 12 ఏళ్ళు గా తెలుగులో నటిస్తూ వస్తుంది. ఇలా వైవిద్యం అయిన పాత్రలలో నటిస్తూ తన అందంతో అభినయంతో తెలుగు ప్రకకులకు సుపరిచితం అయింది.

Advertisement

ఈ భామ ఇప్పుడు బుల్లితెరపై ఢీ జోడీ వంటి షోలో హోస్ట్ గా చేస్తూ అందరినీ అకట్టుకుంటుంది. ఈమె ఈ ఒక్క షోనే కాకుండా అవకాశం దొరికినప్పుడల్లా అన్నీ టీవీ షోస్ లలో కనిపిస్తూ సందడి చేస్తోంది. ఈమె డాన్స్ షోస్ లో చేసే సందడి అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. పూర్ణ తనకు ఉన్న డాన్స్ ప్రతిభతో బుల్లితెరపై కూడా చాలా మంది అభిమనులను సంపాదించుకుంది. ఢీ షోలో ప్రదీప్, హైపర్ ఆది, సుధీర్ తో చేసే కామిడీ చాలా బాగా కట్టుకుంది. ఈ విధంగా గా కూడా ఈమె బుల్లి తెరపై తన అభిమానులందరికి చాలా దగ్గర అయింది. ఇది ఎలా ఉండగా ఇప్పుడు తన అభిమానులకు షాక్ ఇచ్చింది.

Advertisement
poorna engagement 
poorna engagement

పూర్ణ దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త అయినటువంటి షానిధ్ అసిఫ్ అలీ తో ఎవరికి తెలియకుండా నిశ్చితార్థం చేసుకుంది. ఇది ఆమె ఇంటి పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఈమె కాబోయే భర్త జే బీ ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అధినేత, ఆమె ఇటీవల తన ఎంగేజ్మెంట్ ఫోటోను తన ఇనిస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇది చూసిన తన అభిమనులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. పూర్ణ పోస్ట్ చేసిన ఫొటోస్ ద్వారా తన కాబోయే భర్తను అందరికి సోషల్ మీడియా వేదికగా పరిచయం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యం లో ముంచెత్తింది.

Advertisement