Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త… త్వరలోనే ఆదిపురుష్ మూవీ రానుంది… ఎప్పుడంటే…

Prabhas: ‘ బాహుబలి ‘ సినిమా తర్వాత ప్రభాస్ కు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. ఎంతో కాలం టాలీవుడ్ సినిమాలో నటించిన ప్రభాస్ ఇప్పుడు బహు భాష చిత్రాలను చేస్తున్నాడు. ఇలా ఎప్పటికో ఎన్నో చిత్రాలను లైన్ లో పెట్టుకొని యూనివర్సల్ స్టార్ గా చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. వాటిలో ఒక్కొక్కటిగా సినిమాలను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అయితే ప్రభాస్ ఇప్పుడు నటిస్తున్న చిత్రాలలో ‘ ఆది పురుష్ ‘ ఒక పౌరాణిక కథతో వస్తుందని తెలిసిందే. బాలీవుడ్ లో చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఓం రౌత్ రూపకల్పనలో ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ నేరుగా ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రామాయణంలో ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని అంశంతో ఈ మూవీ రూపొందుతుంది. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్ట్ మీద ఈ సినిమాలో చూపించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Advertisement

‘ ఆది పురుష్ ‘ సినిమా షూటింగ్ చాలా రోజులు క్రితమే ప్రారంభం అయింది. అయితే మధ్యలో కొన్ని ఆటంకాల వలన ఆలస్యం అయింది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగాను, రావణుడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. పౌరాణిక కథతో వస్తున్న సినిమాకి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఏకంగా 100 కోట్లు కేటాయించారు. అందుకు అనుగుణంగానే ఈ పనులు ఎన్నో జాగ్రత్తలు నడుము జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కాలేదు. గత ఏడాదే రిలీజ్ చేస్తారని అనుకున్నారు.

Advertisement

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త…

prabhas adipurush updates from september
prabhas adipurush updates from september

ఆ తర్వాత సంవత్సరం శ్రీరామనవమికి రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభాస్ పుట్టిన రోజు త్వరలో రానుందని అప్పుడు వదులుతారని వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘ ఆది పురుష్ ‘ సినిమాకు సంబంధించిన అప్డేట్లను సెప్టెంబర్ నుంచి ప్రారంభించబోతున్నారట. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను టి సిరీస్ బ్యానర్ పై కృష్ణకుమార్, భూషణ్ కుమార్, ప్రసాద్, రాజేష్, నాయర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే సంవత్సరం జనవరిలో విడుదల చేయబోతున్నారు.

Advertisement