Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ .. అప్పటినుంచే సలార్ బుకింగ్స్ మొదలు ..

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ సలార్ ‘ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కేజిఎఫ్ సిరీస్ తో పాపులర్ అయిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమా పై భారీ అంచనాల పెరిగాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశమంతటా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విడుదల చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా పట్ల ఒక్క ఇండియాలోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా భారీగా హైప్ క్రియేట్ అయింది.

Advertisement

prabhas-salaar-bookings-open

Advertisement

యూఎస్ లో ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ ప్లాన్ చేయగా తాజాగా ఈ సినిమా బుకింగ్స్ పై అప్డేట్ ను అందించారు. నార్త్ అమెరికాలో నవంబర్ 20 నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నట్లు పోస్ట్ ని కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. దీంతో యూఎస్ లో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తున్నారు. హోంబలే వారు 150 కోట్ల బడ్జెట్లో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

prabhas-salaar-bookings-open

అలాగే ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు వస్తున్న సలార్ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసేవన్ని పాన్ ఇండియా సినిమాలే. వరల్డ్ వైడ్ గా ఫుల్ పాపులారిటీ ఉన్న ప్రభాస్ కి ఈ సినిమా అయినా ప్రభాస్ కి సక్సెస్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement