Prasanth Neel : నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ టైగర్ ఇప్పుడు RRR మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. వరల్డ్ వైస్ గా రిలీజ్ అయి ఈ సినిమా భారీ స్థాయిలో సక్సెస్ ని అందుకుంది. తాజాగా పాపులర్ ఓటిటి ప్లాట్ఫార్మ్స్ లో స్టీమింగ్ అవుతూ. హాలీవుడ్ నటులను, డైరెక్టర్స్, రైటర్స్ ను ఎంతగానో కట్టిపడేసింది. అదేవిధంగా కొన్ని ప్రతిష్టాత్మక అవార్డు ప్రోగ్రాంలో న్యూస్ లో ఎక్కి ఆసక్తిగా మారింది. దాంతో ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించబోయే ప్రాజెక్టులపై అభిమానులలో ప్రత్యేక ఆలోచన ప్రారంభమైంది. దీని సందర్భంగా ఎన్టీఆర్ రెండు క్రేజీ ప్రాజెక్టులను ప్రకటించారు.
దానిలో 30వ చిత్రంగా కొరటాల శివతో మెగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని చేయబోతున్నట్టుగా ఎన్టీఆర్ బర్త్ డే నాడు తెలియజేసిన విషయం. అలాగే ఇప్పటివరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి ఇంకొక 30 రోజులైనా సమయం పట్టేటట్లు ఉన్నది. ఇది ఇలా ఉండగా 31 ప్రాజెక్టుగా కేజిఎఫ్ ఏం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కో ప్రాజెక్టుకి ఎన్టీఆర్ ఓకే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.
అలాగే మైత్రి సినిమా మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించబోతున్నారు.
Prasanth Neel : ఎన్టీఆర్ ప్రాజెక్టు పై గుడ్ న్యూస్ చెప్పిన ప్రశాంత నీల్…

ఈ సినిమా మొదటి లుక్ పోస్టర్ని ఎన్టీఆర్ బర్త్డే నేపథ్యంలో మే 20న అధికారికంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా ముందు మొదలవుతుందా.? అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ప్రశాంత్ నీలు అందించి ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త చెప్పారు. యంగ్ టైగర్ తో మూవీ ఎప్పుడు మొదలు పెడుతున్నాడు. మీడియా సాక్షిగా తెలియజేశాడు. ఏపీలోని నీలకంఠాపురానికి పర్సనల్ వర్క్ మీద వెళ్లిన ప్రశాంతిని అక్కడి మీడియాను కలిసి యంగ్ టైగర్ మూవీ పై అప్ డేట్స్ ఇవ్వమని అడిగారు.
ముందు స్టోరీ చెప్పాలా అంటూ కామెడీ చేసిన ప్రశాంత్ నీల్ తదుపరి యంగ్ టైగర్ తో ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం ఏప్రిల్ లేదా మేలో మొదలు పెట్టబోతున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ కి నేను దాదాపు రెండు సంవత్సరాలుగా పెద్ద ఫ్యాన్ నీ అని.. ప్రాజెక్ట్ కాయం కాకముందు తనని మామూలుగా పది నుంచి పదిహేను సార్లు మీట్ అయ్యారని తెలియజేశారు.