Punarnavi : పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉయ్యాల జంపాల సినిమాలో నటించే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరైంది. బిగ్ బాస్ హౌస్ లో ఆమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. తన తోటి కంటెస్టెంట్ రాహుల్ తో చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ చూసి కచ్చితంగా హౌస్ నుండి రాగానే గుడ్ న్యూస్ చెప్పేస్తారు అనుకున్నారు. పెళ్లి చేసుకుంటారు అని అంత ఆశపడ్డారు. కానీ బిగ్ బాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారు అంటూ రూమర్స్ వచ్చాయి.
ఇదే విషయంపై వాళ్లు స్పందిస్తూ అసలు మేము ప్రేమించుకుంటే కదా బ్రేకప్ చెప్పడానికి అంటూ ఆ వార్తలను కొట్టి పడేశారు. బిగ్ బాస్ తర్వాత పునర్నవి తనదైన స్టైల్ లో కొన్ని సినిమాలకు సైన్ చేసింది. ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది. కానీ ఏది అంతగా హిట్ ఇవ్వలేదు. తోటి కంటెస్టెంట్ వితికా తో కలిసి కొన్ని వీడియోలు కూడా చేసింది. అయినా పునర్నవిని ఎవరు పట్టించుకోలేదు. దీంతో అమ్మడు లండన్ కి వెళ్ళిపోయింది. రాహుల్ సిప్లిగంజ్ మరొక తోటి కంటెస్టెంట్ అషూ రెడ్డితో ఫ్రెండ్షిప్, లవ్ అంటూ ఏం చేస్తున్నాడో తెలియకుండా టైం గడుపుతున్నాడు. ప్రస్తుతం లండన్ లో హ్యాపీగా గడుపుతున్న పున్ను సోషల్ మీడియా ద్వారా తెలుగు అభిమానులకు దగ్గర అవుతూనే ఉంటుంది.
Punarnavi : షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన అమ్మడు…

సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లో లైవ్ లో ఫాన్స్ తో ముచ్చటిస్తూ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. రీసెంట్ గా పున్ను అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ పునర్ణవి ని పర్సనల్ క్వశ్చన్ అడిగి షాక్ ఇచ్చాడు. దీంతో పునర్నవి స్టన్నింగ్ ఆన్సర్ ఇస్తూ దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. నెటిజన్ మాట్లాడుతూ పునర్నవి మీరు ఇంకా వర్జిన్ నేనా…? అంటూ షాకింగ్ క్వషన్ వేసాడు. దీంతో పున్ను ఎస్ ఈ ప్రశ్న కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటూ స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చి అసలు మ్యాటర్ చెప్పకుండానే స్కిప్ చేసి మరోసారి తన మాటకారితనాన్ని ప్రూవ్ చేసింది. ప్రస్తుతం పున్ను చేసిన ఆన్సర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.