Puri Jagannadh : యూత్ ఐకాన్ స్టార్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఆ తరువాత ‘ గీతగోవిందం ‘ సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత వరుస చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే ప్రస్తుతం రౌడీ స్టార్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. పూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై చార్మి, పూరి, కరణ్ జోహార్, హీరో యష్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సారా కా బ్రీడ్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతుంది.
విజయ్ నటిస్తున్న ‘ లైగర్ ‘ సినిమా ఆగస్టు 25న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న పూరి ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ‘ లైగర్ ‘ సినిమాలో మొదట హీరోయిన్ గా జాన్వి కపూర్ ను తీసుకుందామని అనుకున్నట్టు చెప్పాడు. తాను శ్రీదేవికి వీరాభిమానిని , అందుకే ఈ సినిమా లో హీరోయిన్ గా జాన్వి కపూర్ ఎంచుకున్నానని అన్నాడు. అయితే ఆమె డేట్స్ లేకపోవడంతో అనన్య పాండే పేరును కరణ్ జోహార్ సూచించారని తెలిపారు.
Puri Jagannadh : లైగర్ సినిమాలో మొదట ఆ హీరోయిన్ అనుకున్నాం

ఈ విధంగా ‘ లైగర్ ‘ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా ఎంటర్ అయింది. అయితే పూరి తాను లైగర్ సినిమా కథను పదేళ్ల క్రితమే రాసుకున్నానని చెప్పాడు. ఈ కథను విజయకు చెప్పగానే ఓకే చేశాడు. రెండు స్టోరీలు చెప్పిన లైగర్ ముందు చేద్దామన్నాడు. నార్త్ లో విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ యాక్టింగ్ కు అక్కడ అభిమానులు ఫీదా అయిపోయారు. అందుకే అతను ఎక్కడికి వెళ్లినా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అర్జున్ రెడ్డి సినిమా నుంచి అక్కడి వాళ్లను అభిమానిస్తున్నారు. ఆ అభిమానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.