Puspa 2 : పుష్ప 2 సినిమా ఇంకా లేట్ కానుందా, బన్నీ అభిమానులకు ఇంకా ఎదురుచూపులు తప్పవా.

Puspa 2 : పుష్ప బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డులు తిరగరాసింది మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ సుకుమార్ దాదాపు రెండు సంవత్సరాల కష్టపడి ఈ మూవీని అద్భుతంగా తేర పైకి తీసుకురావడం జరిగింది. ఈ సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్ చాలా కష్టపడి అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు హృదయాలను దోచుకున్నారు. అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఈ సినిమాని అద్భుతంగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. ఇలా ఉండగా పుష్ప2 మూవీ గురించి ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

అయితే వారి ఎదురుచూపులు తగ్గట్టుగానే మూవీ ఇంకా వెనక్కి వెళ్తూ వస్తుంది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ జూలైలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమాని అక్టోబర్ కి పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది. ఎంత ఆలస్యమైనా ఈ సినిమాని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే అదే స్థాయిలో సినిమాని తెరపైకి తీసుకురావడానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కే జి ఎఫ్2 మూవీ కేజీఎఫ్ కంటే చాలా పెద్ద విజయం సాధించింది. దీనికి కారణం కేజీఎఫ్ పెద్ద సక్సెస్ అయిన తర్వాత కెజీఎఫ్2 గురించి ఉత్కంఠగా ప్రేక్షకులు ఎదురు చూసి అలా రిలీజ్ అయిన సినిమా కే జి ఎఫ్ కంటే భారీ విజయం సాధించింది. ఇదే స్తెటజి ని సుకుమార్ ఇప్పుడు ఫాలో అవుతూ ఈ మూవీ ను ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాడు.

Advertisement

Puspa 2 : బన్నీ అభిమానులకు ఇంకా ఎదురుచూపులు తప్పవా.

Puspa2 movie delaying due to techinical resons
Puspa2 movie delaying due to techinical resons

అలాగే ఈ మూవీలోని పాత్రలపై కూడా సుకుమార్ చాలా శ్రద్ధ వహిస్తున్నట్లు సమాచారం. పుష్ప2 సినిమాలో శ్రీవల్లి క్యారెక్టర్ ఎంతో మనందరికీ పుష్ప మూవీ లో ముందే తెలిసిందే. పుష్ప2 లో మాత్రం సెకండ్ హీరోయిన్ ఎంపిక కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పుష్ప మూవీ లో బన్వర్ సింగ్ శకవత్ చెల్లెలు పాత్ర కోసం ఒక హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందని మూవీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆ చెల్లెలు పాత్ర ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విధంగా పుష్ప2 మూవీ మన ముందుకు రావటానికి ఇంకా సమయం పట్టేలా ఉంది.

Advertisement