Ashwin Gangaraju : రాజమౌళి శిష్యుడి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ… ఆరు భాషల్లో రిలీజ్ కానున్న సినిమా…

Ashwin Gangaraju : దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు తెలుగులో ఆకాశవాణి సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఈయన రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ, బాహుబలి వంటి భారీ చిత్రాలకు పని చేశాడు. అయితే ఇప్పుడు మరో సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ బెంగాలీ రచయిత బకించంద్ర చటర్జీ రచించిన నవల ఆనంద్ మఠ్ అనే నవల రచించిన వందేమాతర గీతాన్ని మన జాతీయ గేయంగా మనం స్వీకరించాం. ఆ పాట రాసి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. దాని సందర్భంగా దానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను శైలేంద్ర కుమార్, సుజై కుట్టి, కృష్ణ కుమార్ బి, సూరజ్ శర్మ విడుదల చేశారు.

Advertisement

Ashwin Gangaraju : ఆరు భాషల్లో రిలీజ్ కానున్న సినిమా

మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశం యావత్తు ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు శైలేంద్ర కుమార్, సుజయ్ కుట్టి, కృష్ణ కుమార్ బి, సూరజ్ శర్మ వారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 1770 ని అనౌన్స్ చేశారు.ss1 ఎంటర్టైన్మెంట్, పీకే ఎంటర్టైన్మెంట్ పథకాలపై బహుభాషా చిత్రంగా ఈ సినిమాను బకించంద్ర చటర్జీ గారు రాసిన ఆనందమఠ్ అనే నవల ఆధారంగా చేసుకొని రూపొందించబోతున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వ శాఖలో ఈగ, బాహుబలి వట్టి భారీ చిత్రాలకు పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రాన్ని కి కథ కథనాన్ని అందిస్తున్నారు.

Advertisement
rajamouli student Ashwin Gangaraju will direct pan india movie
rajamouli student Ashwin Gangaraju will direct pan india movie

2021లో విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలందుకున్న ఆకాశవాణి సినిమాతో అశ్విన్ గంగరాజు దర్శకుడుగా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. 1770 చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ బెంగాలీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా ఎవరు నటిస్తారనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీపావళి నాటికి మొత్తం నటీనటులు సాంకేతిక నిపుణులను అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతం దర్శకుడు తన టీం తో కలిసి ఈ పిరియాడిక్ సినిమాలు రూపొందించడానికి సంబంధించి న రీసెర్చ్ చేస్తున్నారట. త్వరలోనే సినిమాకి సంబంధించిన విషయాలను అనౌన్స్ చేస్తారు.

Advertisement