Chiranjeevi : మెగాస్టార్ తనయుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తన సొంత టాలెంట్ తో మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ ను సంపాదించుకున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ చిరుత ‘ సినిమాలో హీరోగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా మామూలుగానే ఆడింది. ఈ సినిమాలో చరణ్ నటన కూడా అంతంత మాత్రమే అంటూ ప్రముఖులు తేల్చేశారు. కొందరైతే రామ్ చరణ్ ను దారుణంగా ట్రోల్ చేశారు. అసలు నీ మొఖానికి నువ్వు మెగా హీరోనా అంటూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వాటన్నింటిని తిప్పి కొడుతూ రెండో సినిమా ‘ మగధీర ‘ బ్లాక్ బస్టర్ హిట్టుగా బాక్సాఫీస్ వద్ద నిలిచింది.
ఈ సినిమాని ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించి పెద్ద విజయాన్ని దక్కించుకున్నారు. ఇప్పటికీ ఈ సినిమా అంటే పడి చచ్చిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాలో ఆ గ్రాఫిక్స్, సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, కాజల్ అందాలు, ఇప్పటికీ సినిమా డైలాగ్స్ మన లైఫ్ స్టైల్ లో వాడుతూనే ఉంటాం. అంతలా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చేసింది. ‘ మగధీర ‘ సినిమా హిట్ తర్వాత రామ్ చరణ్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాలా సినిమాలు చేశాడు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి కూడా. రామ్ చరణ్ నటనకు అందరు ఫిదా అయ్యారు.
Chiranjeevi : గట్టి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి…

అయితే మగధీర సినిమా టైంలో రామ్ చరణ్ ని తన బిహేవియర్ తో కాజల్ కోపం తెప్పించిందంట. షూటింగ్ కి టైం కు వచ్చేది కాదంట. షార్ట్ రెడీ అయిన ఆలస్యం చేసేదట. దీంతో రాజమౌళి కూడా కాజల్ బిహేవియర్ తో విసుగు చెందాడని అప్పట్లో టాక్ వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో చరణ్ ఇదే విషయాన్ని చెప్పేశాడు. కానీ ఆ తర్వాత జస్ట్ జోకింగ్ అంటూ కవర్ చేసుకోవచ్చాడు. ఈ విషయంలో కాజల్ కి చిరు కూడా వార్నింగ్ ఇచ్చారట. ప్రస్తుతం కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తుంది. మంచి స్టోరీ దొరికితే సినిమాలు చేయడానికి రెడీ అంటుంది.