ఐపీఎల్ లో కొత్త టీమ్ – రామ్ చరణ్ కొత్త ఆలోచన..!?

వచ్చే ఏడాది ఐపీఎల్ లో మరో కొత్త టీమ్ రానుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. వైజాగ్ వారియర్స్ పేరిట కొత్త టీమ్ ను తీసుకొచ్చేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

తెలంగాణ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది కానీ ఏపీకి ఎలాంటి టీమ్ లేదు కాబట్టి వైజాగ్ వారియర్స్ అనే టీమ్ తీసుకొస్తే బాగుంటుందని రామ్ చరణ్ భావిస్తున్నట్లు టాలీవుడ్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెడుతోన్న రామ్ చరణ్ క్రికెట్ రంగంలోనూ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఐపీఎల్ లో పెట్టుబడులు పెటడం వలన రెండు విధాల ఉపయుక్తంగా ఉంటుందనేది రామ్ చరణ్ ఆలోచనగా చెబుతున్నారు. ఒకటి పాన్ ఇండియా లెవల్ లో హీరోగా మరింత గుర్తింపు రావడం. బిజినెస్ పరంగా మరింత రాణించడం. ఇప్పటికే బిజినెస్ మెన్ గా మారిన చరణ్ ట్రూ జెట్ పేరుతో విమానయాన సంస్థను షురూ చేశాడు.

నిర్మాతగా మారి సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రీడారంగంలోనూ అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇందుకు మెగాస్టార్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ లోకి రాను, రాను కొత్త ప్రాంచైజీలు వస్తున్నాయి. గతేడాది గుజరాత్, లక్నో ఫ్రాంచైజీలు అడుగుపెట్టాయి.

ఏపీ నుంచి టీమ్ లేకపోవడంతో రామ్ చరణ్ వైజాగ్ వారియర్స్ పేరిట ఒక కొత్త ఐపీఎల్ టీమ్ తో వచ్చే ఏడాది నుంచి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement