Ramabanam : పంబ రేగాలి అంటూ అదరగోడుతోన్న గోపీచంద్ , డింపుల్

గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మరో చిత్రం ” రామబాణం “. ఇదివరకు వీరిద్దరి కాంబోలో ఫ్యామిలీ ఎంటర్ టైన్ గా చిత్రాలుగా వచ్చిన “లక్ష్యం” , “లౌక్యం” చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. రామబాణం కూడా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ చిత్రమే. దీంతో ఈ సినిమాతో హిట్ కొట్టేసి హ్యాట్రిక్ ను అందుకోవాలని చూస్తున్నారు.

Advertisement

Advertisement

శ్రీవాస్ , గోపీచంద్ కాంబినేషన్ లపై ఆడియన్స్ కు మంచి ఒపినియన్ ఉండటంతో…ఈ సినిమాపై కూడా మంచి బజ్ నెలకొంది. ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగానే మరోవైపు చిత్ర ప్రమోషన్స్ ను స్టార్ చేసింది చిత్ర యూనిట్ . గ్లింప్స్, టీజర్, స్పెషల్ పోస్టర్స్ అంటూ వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇటీవలే ఐఫోన్ అనే సాంగ్ రిలీజ్ చేయగా, సెకండ్ సింగల్ ని రిలీజ్ చేశారు.

దరువు వెయ్యరా, చిందు వెయ్యరా, పంబ రేగాలి అంటూ సాగుతోన్నఈ సాంగ్ లో గోపీచంద్, డింపుల్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకి మీకీ జె మేయర్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. కృష్ణ తేజస్వి, చైత్ర అంబడిపూడి పాడారు.మే 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement