Ram Gopal Verma: రాంగోపాల్ వర్మ ప్రతి ఒక మాట డిఫరెంట్ గా ఉంటుంది. అయినా మాట లు లోతుగా ఆలోచిస్తేనే అర్థం అవుతాయి. కొత్తగా టాలీవుడ్ సినిమాలతో పాటు అన్ని భాషల సినిమా సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వివిధ రకాల చర్చలు వస్తాయి. అందరూ కూడా సోషల్ మీడియా పరిధి లో ఉండడం వల్ల ఈ సినిమా ఇండస్ట్రీకి నష్టాలు వస్తున్నాయంటూ వార్తలు చెబుతున్నారు. సినిమాలు డిజిటల్ ప్లాట్ఫారంపై ఆలస్యం గా రిలీజ్ కావడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కొందరు అనుకుంటున్నారు.
ఓటీటీలో లేటుగా వచ్చిన మూవీస్ కి కూడా పెద్దగా లాభం ఏమీ లేదు. నిర్మాతలు ఈ సమయంలో ఎక్కువమంది ఓటీటీల మీద మండిపడుతున్నారు. వారి మాటలను వర్మ సున్నితంగా తీసుకున్నాడు.. గోపాల్ వర్మ మాట్లాడుతూ ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గిలను హోటల్ నిర్వాహకులు మరియు యజమాన్యాలు బ్యాన్ చేయాలంటే ఎలా ఉంటుందో నిర్మాతలు ఓటీటీలను బ్యాన్ చేయాలంటే అలాగే ఉంటుందని కామెంట్స్ చేశారు.
Ram Gopal Verma : ఓటిటి వద్దంటే జొమాటో, స్విగ్గి ఫుడ్ డెలివరీ యాప్ బ్యాన్ చేసినట్లు గా ఉంటుంది అంటున్న రామ్ గోపాల్…

ఫుడ్ డెలివరీ యాప్ వల్ల హోటల్ కి ఎక్కువగా డబ్బులు లభిస్తుందని. అలాగే ఓటీటీలు వల్ల కూడా ఎటువంటి నష్టం లేదు అనేది రాంగోపాల్ వర్మ గొడవ. ఈ సినిమా మంచిగా తీస్తే దాన్ని థియేటర్లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారని చెప్పాడు. ఈ సినిమా అంటే ఇంట్రెస్ట్ లేనివారు డిజిటల్ ప్లాట్ ఫారం పై చూస్తారు. అంతేకానీ ఓటీటీల వల్ల సినిమా రన్ అవ్వడం లేదంటే నేను ఊరుకోను అన్నట్లుగా రాంగోపాల్ వర్మ తన సందేశాన్ని వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మ మాటలపై ఇతర టాలీవుడ్ నిర్మాతరలు ఎలా స్పందించారు అనేది చూడాలి మరి.