Rashmi Gautam : రష్మీ గౌతమ్ అంటే జబర్దస్త్.. జబర్దస్త్ అంటే రష్మీ గౌతమ్. జబర్దస్త్ కంటే ముందు రష్మీ చాలా సినిమాల్లో నటించినప్పటికీ తనకు అంతగా గుర్తింపు దక్కలేదు కానీ.. ఎప్పుడైతే జబర్దస్త్ కు వెళ్లిందో తన రేంజే మారిపోయింది. మొన్నటి వరకు ఒక ఎక్స్ ట్రా జబర్దస్త్ కు మాత్రమే యాంకర్ గా ఉన్న రష్మీ.. ఇప్పుడు అనసూయ స్థానంలో జబర్దస్త్ కు కూడా యాంకర్ గా వచ్చేసింది. అంటే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండు షోలకు ఇప్పుడు తనే సోలో యాంకర్.

జబర్దస్త్ తర్వాత రష్మీ అంటే గుర్తుకు వచ్చేది సుడిగాలి సుధీర్. అవును.. ఆన్ స్క్రీన్ పై ఈ జంట కెమిస్ట్రీ మామూలుగా వర్కవుట్ కాలేదు. తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఈ జంట దూరం అయిపోయింది. సుధీర్.. జబర్దస్త్ ను వీడి వెళ్లిపోవడంతో ఈ జంట గురించి చర్చ తగ్గింది.
అయితే.. ప్రస్తుతం రష్మీ గౌతమ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీక్ మొత్తం ఫుల్ టు ఫుల్ బిజీగా గడిపే రష్మీ గౌతమ్.. ఇటీవల తన ఫ్రెండ్స్ తో కలిసి వీకెండ్ లో ఫుల్ ఎంజాయ్ చేసిందట. తన ఫ్రెండ్స్ తో రచ్చ రచ్చ చేసిందట.
Rashmi Gautam : నైట్ పార్టీలో చిల్ అయిన రష్మీ గౌతమ్
స్నేహితులతో కలిసి డ్రింక్ పార్టీ చేసుకుందట రష్మీ. ఫ్రెండ్స్ తో కలసి తను పెగ్గేసిందని.. ఆ తర్వాత రచ్చ చేసిందని వార్తలు వస్తున్నాయి. రష్మీ తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసి రష్మీ అభిమానులు, నెటిజన్లు ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. సూపర్.. ఎంజాయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

నిజానికి రష్మీ.. సోషల్ మీడియాలో ఎప్పటికీ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటే రష్మీ.. ఎప్పటికప్పుడు తన సినిమా, పర్సనల్ విషయాలను కూడా వాళ్లతో పంచుకుంటూ ఉంటుంది.