Rashmika Mandanna : రష్మికా మందన్నా కంటే కూడా శ్రీవల్లి అంటేనే ఈజీగా తనను గుర్తుపడతారు. తను ఇప్పుడు కేవలం టాలీవుడ్ కో.. కోలీవుడ్ కో… లేక శాండిల్ వుడ్ కో పరిమితం అయిపోయిన హీరోయిన్ కాదు.. తను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. కేవలం పుష్ప అనే ఒక్క సినిమాతో తన రేంజే మారిపోయింది. ప్రస్తుతం పుష్ప2 సినిమాలో నటిస్తున్న రష్మికా మందన్నాకు వరుస పెట్టి సినిమా అవకాశాలు వస్తున్నా ఆచీతూచీ అడుగులు వేస్తోంది ఈ సుందరి.

రష్మికా మందన్నా అనగానే మనకు గుర్తొచ్చే మరో విషయం.. తన చేతి మీద ఉన్న టాటూ. తన చేతి మీద రష్మికా.. irreplaceable అని రాయించుకుంది. ఇర్రీప్లేసబుల్ అంటే భర్తీ చేయలేనిది అని అర్థం. మరి తన చేతి మీద అలా టాటూ ఎందుకు వేయించుకుంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి కలిగినా.. దాని వెనుక ఉన్న స్టోరీ గురించి ఎవ్వరికీ తెలియలేదు.
Rashmika Mandanna : తన 15 వ ఏటనే ఆ టాటూను వేయించుకుందట
కానీ.. ఇప్పుడు తన టాటూ వెనుక ఉన్న స్టోరీని రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది. నిజానికి ఆ టాటూను రష్మిక తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వేయించుకుందట. ఆ టాటూను వేయించుకోవడానికి కారణాన్ని మాత్రం ఇటీవల రివీల్ చేసింది.
తను చదువుకునే సమయంలో 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన ఫ్రెండ్ ముఖ్యంగా అబ్బాయిలు తనను హేళన చేశారట. అబ్బాయిలు టాటూ వేసుకున్నట్టు అమ్మాయిలు వేసుకోలేరని.. అమ్మాయిలు టాటూ వేసేటప్పుడు ఆ నొప్పిని తట్టుకోలేరని తన ఫ్రెండ్స్ హేళన చేశారట. దీంతో తనకు చాలా కోపం వచ్చిందట.
మచ్చా.. నేను టాటూ వేసుకొని చూపిస్తాను అని సవాల్ చేసిందట. వెంటనే ఏ టాటూ వేసుకోవాలని ఆలోచించి చివరికి ఇర్రీప్లేసబుల్ అనే టాటూను వేయించుకుందట. ఇర్రీప్లేసబుల్ అనే వేయించుకోవడానికి కూడా ఓ కారణం ఉందట. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తిని కూడా మరో వ్యక్తితో పోల్చలేం. ఎవరికి వారే యూనిక్. నేను యూనిక్. నువ్వు యూనిక్. ప్రతి ఒక్కరు యూనిక్. అందుకే.. ఆ వర్డ్ అయితే బాగుంటుందని ఇర్రీప్లేసబుల్ అని తన చేతి మీద వేయించుకుందట రష్మికా. మొత్తానికి తన చేతి మీద టాటూను వేయించుకొని తన ఫ్రెండ్స్ కు చూపించి తనేంటో నిరూపించిందట. అది తన టాటూ వెనుక ఉన్న అసలు స్టోరీ.