Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్ 7 మొత్తానికి 2వ వారంలోకి అడుగు పెట్టింది. తొలివారం ఎలిమినేషన్ లో కిరణ్ రాథోడ్ హౌస్ నుండి బయటకు వెళ్ళింది. రెండో వారం కూడా నామినేషన్ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా సాగింది. గత సీజన్స్ లో ఎన్నడూ లేనంతగా ప్రతి నామినేషన్ సెక్షన్ లో హీట్ అయితే జనరేట్ అవుతుంది. ఇక రెండవ వారం నామినేషన్ ఎపిసోడ్ లో శివాజీకి జరిగిన నామినేష న్స్ హైలెట్ గా నిలిచాయి.. ఇక రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నామినేషన్ అయితే పెద్ద వార్ ను తలపించింది. మరి ముఖ్యంగా అమర్ దీప్ తన ఉగ్రరూపం చూపించారు. అలాగే హౌస్మెట్ గా పవర్ హస్త్రాను సాధించుకున్న సందీప్ కు బిగ్ బాస్ డైరెక్ట్ నామినేషన్ ఇవ్వగా ఆయన ప్రిన్సును నామినేట్ చేశాడు.
డైరెక్ట్ గా నామినేట్ అయిన ప్రిన్స్ ను మరలా ఎవరు నామినేట్ చేయవద్దని బిగ్ బాస్ చెప్పాడు. ఇక మిగతా కంటెస్టెంట్స్ విషయానికొస్తే కారణాలు చెప్పి నామినేట్ చేయాలని తెలియజేశారు. ఈ ప్రక్రియలో పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేయాలనుకునే వారి గురించి బిగ్ బాస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేసేందుకు ఆరుగురు కంటెస్టెంట్స్ ముందుకు వచ్చారు. ఇక ఈ నామినేషన్ సమయంలో కంటెస్టెంట్స్ చెప్పిన కారణాలు వాటికి ప్రశాంత్ ఇచ్చిన సమాధానాలు గొడవలకు దారి తీసాయి. మరి ముఖ్యంగా అమర్ దీప్ అయితే పల్లవి ప్రశాంత్ మాట్లాడనివ్వకుండా తన ఉగ్రరూపం చూపించేశాడు. అయితే ముందుగా గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, దామిని , షకీలా, ప్రియాంక , పల్లవి ప్రశాంత్ పై పలు కారణాలు చెప్పి నామినేట్ చేశారు.
అలాగే ప్రియాంక గౌతమ్ ను నామినేట్ చేసే సమయంలో ప్రశాంత్ తనని తాను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఇక సెటైర్లు వేస్తూ మాట్లాడడం మొదలుపెట్టగా అదే సమయానికి శివాజీ కూడా ప్రశాంత్ కు మద్దతుగా నిలిచాడు. దీంతో ఇతర కంటెస్టెంట్స్ అందరూ ప్రశాంత్ తప్పు ను ఈ రోజు ఒప్పుకోవాలన్నట్లుగా మాట్లాడారు. చివరికి అమర్ దీప్ ఎంటర్ అయిన తర్వాత మాత్రం అతను చెప్పిన పాయింట్స్ మరియు మాట్లాడిన మాటలకు కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. ఇక అమర్ దీప్ చెప్పిన పాయింట్స్ ఏంటంటే ఇంటి పనుల్లో ఎక్కువగా కనిపించు అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నీకు రెండు మొహాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఉపయోగిస్తున్న బాడీ లాంగ్వేజ్ ఇంట్లో లేదు.
అదే ఇంట్లో చేస్తే ఎంటర్టైన్మెంట్ నువ్వు కూడా ప్రేక్షకులకు సుపరిచితుడవే. నీ వీడియోలు బాగా ట్రోల్ అయ్యాయని సీరియస్ గా చెప్పడం మొదలు పెట్టాడు అమరదీప్. కానీ పల్లవి ప్రశాంత్ వింటున్న పద్ధతి అమర్ దీప్ కు నచ్చలేదు. ప్రశాంత్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ల భుజం పెట్టడంతో భుజం దించు అంటూ బెదిరించాడు అమర్ దీప్. ఎన్నో సీజన్లు చూసి వచ్చావ్ నిజమైన ప్రశాంత్ ను చూడాలని ఉందని అమర్ దీప్ అన్నాడు.అంటే ఫేక్ గా ఉన్నావని ప్రశాంత్ ని ప్రశ్నించాడు. సందర్భానికి తగినట్టు అల్లుకుపోతున్నావు. ఎన్నో సీజన్ లను పర్యవేక్షిస్తే కానీ ఇలాంటి అనుభవం రాదని అమర్దీప్ చెప్పాడు. నీకంటే నేను పెద్ద నటుడిని, నువ్వు వెధవవి అయితే నేను పరమ వెధవని అంటూ అమర్దీప్ కౌంటర్ ఇచ్చాడు.
రైతు బిడ్డ కష్టాలంటూ చెబుతున్నావు , బీటెక్ కష్టాల గురించి నీకు తెలుసు అంటూ అమర్దీప్ చెప్పిన మాటలకు సందీప్ రతీక చప్పట్లు కొట్టారు. రైతుబిడ్డ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నావని అమర్దీప్ చెప్పగా దానిని ప్రశాంత్ అసలు ఒప్పుకోలేదు. బిగ్ బాస్ ఛాన్స్ కోసం కుక్కలాగా స్టూడియో చుట్టూ తిరగానని చెప్పుకున్నాడు. ఇక అప్పుడు రతిక స్పందిస్తూ ఛాన్స్ దొరికింది కదా ఇప్పుడు ఏం చేస్తున్నావ్ అని అడిగింది. దీంతో కంటెస్టెంట్స్ చప్పట్లు కొట్టారు. ఇలా పల్లవి ప్రశాంత్ కు నామినేషన్ లో ఆరు ఓట్లు పడ్డాయి. మొన్నటివరకు రతిక వెంటపడిన పల్లవి ప్రశాంత్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇలా రెండవ వారం నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా జరిగాయి.