RT4GM : తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజ మరియు గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ మూడుసార్లు రాగా మూడుసార్లు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ అయింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ ప్రకటించినప్పటి నుండి రవితేజ ఫ్యాన్స్ అంచనాలు విపరీతంగా పెరిగాయి. అయితే గోపీచంద్ మలినెని డైరెక్టర్ గా రవితేజ హీరోగా కొత్త మూవీ ని కొన్ని రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. డాన్ శీను, బలుపు , క్రాక్ వంటి సూపర్ డూపర్ హిట్ అందుకున్న తర్వాత , నాలుగో సారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది. అయితే రవితేజ ఒక సినిమా విడుదల చేసిన వెంటనే మరో సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయడం మామూలే.
ఇదే క్రమంలో ఇటీవల దసరాకు విడుదలైన టైగర్ నాగేశ్వరరావు అలా విడుదలైందో లేదో ఇలా వెంటనే సరికొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. అలాగే ఈ సినిమా మేకర్స్ కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఫాన్స్ లో మంచి హైప్ ను తీసుకొస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ కొంచెం మ్యాటర్ కూడా లీక్ అయింది. ఇలా వైరల్ అవుతున్న వార్తలు ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో రాబోతున్నట్లు సమాచారం. అంతేకాక ఈ సినిమా కోసం మాస్ మహారాజా రాయలసీమ యాస కూడా నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక రాయలసీమ యాస లో మాస్ మహారాజా రవితేజ డైలాగ్స్ చెబితే సినిమా మొత్తానికి హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలల చేశారు.సినిమా టైటిల్ ఏంటనేది ఇంకా ప్రకటించలేదు కానీ RT4GM అనే క్యాప్షన్ తో పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన షూట్ కూడా మొదలుకానుంది. అయితే వీర సింహారెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న గోపీచంద్ రవితేజకు నాలుగో సారి కూడా మంచి విజయం ఇస్తాడో లేదో చూడాలి. ఇది ఇలా ఉండగా సంక్రాంతికి రవితేజ “ఈగల్ “అనే సినిమాతో అభిమానుల ముందుకు రానున్నాడు.