Samantha : సామ్ కు రానున్న రోజుల్లో ఆ సినిమా… మంచి పేరు తెస్తుందన్న ప్రముఖ జ్యోతిష్యుడు…

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు సమంత. ఇప్పుడు ఈ భామ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఈమధ్య వచ్చిన ‘ పుష్ప ‘ సినిమాలో ఐటెం సాంగ్ తో ఇండియాను ఒక ఊపు ఊపేస్తుంది. ఇప్పుడు సామ్ దర్శక ద్వయం హరి-హరీష్ లు దర్శకత్వం వహిస్తున్న సస్పెన్స్ యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ యశోద ‘ లో నటిస్తోంది. ఈ చిత్రంలో సమంత యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొందని, ఆమె యాక్షన్ సినిమాకే హైలెట్ అని అంటున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టులో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ‘యశోద ‘ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

Advertisement

సమంత ‘ యశోద ‘ మూవీ తో పాటు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ రూపొందిస్తున్న విజువల్ వండర్ ‘ శాకుంతలం ‘ సినిమాలో నటిస్తోంది. పురాణాల్లో దుష్యంతుడు, శకుంతల మధ్య ప్రేమ శాపవశాత్తు వారిద్దరు విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం వంటి అంశాలతో ఈ సినిమాను అందమైన ప్రేమ కథగా ఆవిష్కరిస్తున్నారు గుణశేఖర్. ఈ సినిమా విడుదల కావటానికి మరింత టైం పట్టవచ్చు అని దీనికి ముందుగా యశోద సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే సమంత ‘ శాకుంతలం ‘ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.

Advertisement

Samantha : మంచి పేరు తెస్తుందన్న ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి….

Astrologer venu swamy comments on Samantha
Astrologer venu swamy comments on Samantha

2024 వరకు సమంత టైం బాగానే ఉంటుందన్నారు. ‘ శాకుంతలం ‘ సినిమా రానున్న రోజుల్లో సమంతకు మంచి పేరు తెస్తుందన్నారు. అలాగే అప్పట్లో సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అని కూడా వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగచైతన్య విడిపోతారని మూడేళ్ల క్రితమే చెప్పారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో అప్పట్లో బాగా వైరల్ అయింది. సమంత నాగచైతన్యకు పెళ్లి తర్వాత విభేదాలు వస్తాయని సినిమాల పరంగా బాగానే ఉన్నా వ్యక్తిగత విషయంలో మాత్రం ఇబ్బందులు వస్తాయని వేణు స్వామి పేర్కొన్నారు. అలాగే కొందరి హీరోయిన్ల గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 వచ్చేసరికి సమంతా తో పాటు రష్మిక కూడా ఎండ్ అయిపోతుందన్నారు. పూజ హెగ్డే గోల్డెన్ లెగ్ నుంచి ఐరన్ లెగ్గుగా మారిపోతుందని వ్యాఖ్యలు చేశారు.

Advertisement