Samantha : సినీ ఇండస్ట్రీలో ఒకరు చేసిన పాత్రను మరొకరు చాలెంజింగ్ గా తీసుకొని చేసి చూపించడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద తమేంటో నిరూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా హీరోల మధ్య ఈ పోటీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా పాన్ ఇండియా సినిమా ట్రెండ్ నడుస్తుంది. దాదాపు మన సౌత్ హీరోలందరూ సినిమాలను ట్రై చేస్తున్నారు. అందరికీ ఆ క్రేజ్ మాత్రం దక్కడం లేదు. ప్రభాస్ బాహుబలి సినిమాతో స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజిఎఫ్ సినిమాతో హీరో యష్ పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును పొందాడు. అదే రేంజ్ లో కేజీఎఫ్ 2తో మరో రేంజ్ కి వెళ్ళిపోయాడు.
అలాగే అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందినవారే. అయితే హీరోయిన్స్ కూడా గత కొన్నేళ్లుగా చాలెంజింగ్ రోల్ చేయడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. మహానటి సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలు నటించడమే కాదు. బోల్డ్ పాత్రలను చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ముఖ్యంగా నిత్యామీనన్ లాంటివారు మహానటి వంటి సినిమాలను కూడా వదులుకున్న పాత్ర డిమాండ్ చేస్తే లెస్బియన్ క్యారెక్టర్ చేయడానికి ఓకే అంటున్నారు. అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నిత్యామీనన్. ఈ సినిమా హిట్ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది అమ్మడు.
Samantha : షాక్ అయిన సమంత…

నితిన్ హీరోగా నటించిన ఇష్క్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పటికే అభిషేక్ బచ్చన్ మెయిన్ రోల్ లో నటించిన హిందీ వెబ్ సిరీస్ లో నిత్య తోటి నటితో పెదవి ముద్దు పెట్టుకుని షాక్ ఇచ్చింది. అసలు సినిమాలలో హీరోకి లిప్ కిస్ ఇవ్వని నిత్య ఇలా మరో అమ్మాయితో రొమాన్స్ అంటే ఆశ్చర్యపోతున్నారు. అయినా ఆ పాత్రతో బాగానే మెప్పించింది. ఇది చూసిన స్టార్ హీరోయిన్ సమంత కూడా ఓ హాలీవుడ్ సినిమాను ఒప్పుకుందని సమాచారం. నిత్యామీనన్ కంటే నాకేం తక్కువ అనే భావనతో సమంత లెస్బియన్ పాత్రను చేసేందుకు ఓకే చెప్పిందంట.