Naga Chaitanya – Samantha : టాలీవుడ్ లోకి ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో హీరోయిన్ పరిచయం అయిన సమంత అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్నాళ్లకే విడాకులు ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది. పెళ్లికి ముందు టాలీవుడ్ కి పరిమితమైన సమంత పెళ్లి, విడాకుల తర్వాత పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తోంది. పుష్ప సినిమాతో మొదలైన ఆ క్రేజ్ ఇంకా కొనసాగిస్తూనే ఉంది. అంతేకాదు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి తనదైన స్టైల్ లో నటిస్తూ అక్కడ కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.

అక్కడ ఆల్రెడీ ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించి అందరిని ఆకర్షించింది. ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇంగ్లీష్ లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా చేసిన ఈ వెబ్ సిరీస్ కి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఈ సిరీస్ ను ఇండియన్ వర్షన్ లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇకపోతే తాజాగా సమంత గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే సమంత, నాగచైతన్య విడిపోయాక వీళ్ళ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా సమంత ఓ ఎన్నారైను ప్రేమించిందని వార్తలు వచ్చాయి. అయితే ఇది ఒక ఇంగ్లీష్ సినిమా స్టోరీ అని తెలుస్తుంది.
అయితే సమంత హాలీవుడ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సమంత త్వరలోనే ఒక చెన్నై స్టోరీ అనే ఇంగ్లీష్ సినిమాలో నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో భారత సంతతికి చెందిన ఇంగ్లాండులో సెటిల్ అయిన వివేక్ కల్రా అనే వ్యక్తి హీరోగా నటించనున్నాడు. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆసక్తికర కథాంశంతో తిరగబోతుందని తెలుస్తుంది. ఇంగ్లాండ్ కి చెందిన యువకుడికి, చెన్నైకి చెందిన యువతీకి మధ్య జరిగే ప్రేమ కథగా ఈ సినిమా ఉండబోతుందని, త్వరలోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.