Samantha : ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమంత. ఆ సినిమా తర్వాత ఇక వెను తిరిగి చూసుకోలేదు ఈ అమ్మడు. వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకెళుతోంది. అమ్మడు అదృష్టమో లేక కష్టపడిందో తెలియదు కానీ వరుసగా బిగ్ స్టార్స్ తో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సమంత మరిన్ని విజయాలను అందుకుంటూ దూసుకెళుతోంది. సమంత అనుకోకుండా నాగచైతన్యను దూరం చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అభిమానులు ఊహించిన విధంగా విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. మేము విడాకులు తీసుకున్న మంచి ఫ్రెండ్స్ గానే ఉంటామంటు భారీ ప్రకటన ఇచ్చారు ఈ జంట.
ఆ తర్వాత సోషల్ మీడియాలో పరోక్షంగా తిట్టుకుంటూనే ఉన్నారు. ఈ మధ్యన సమంత కాఫీ విత్ కరణ్ షోలో నాగచైతన్య పై సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మా ఇద్దరినీ ఒకే గదిలో పెడితే పదునైన ఆయుధాలు దాచి పెట్టాలంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ ఒక్క మాటతో అక్కినేని అభిమానులు కోపంతో ఊగిపోయారు. అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు సమంత దూరంగా ఉంటుంది. అస్సలు కనిపించడం లేదు. దీంతో అంతా సమంతకు ఏమైందని అంటున్నారు.
Samantha : ఆ విషయంలో నో చెప్పిన సమంత…

అయితే సమంత కావాలని సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందంటూ వార్త బయటకు వచ్చింది. అయితే సమంత మరోసారి ఐటెం సాంగ్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. మరోసారి ఆ స్టైల్ తో హాట్ నెస్ తో ఐటమ్ సాంగ్ చేస్తే చూసి తట్టుకోలేం అంటూ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం సమంత ఎటువంటి ఐటమ్ సాంగ్ చేయడం లేదట. ఇక భవిష్యత్తులో కూడా చేయనని చెప్పేసిందంట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమంతా ని మేము హీరోయిన్ గానే చూడాలనుకుంటున్నాము ఐటమ్ గర్ల్ గా కాదని కామెంట్స్ చేస్తున్నారు.