Samantha : సమంత యశోద సినిమా అప్డేట్… సైలెన్స్ ను బ్రేక్ చేసిన అమ్మడు…

Samantha : సమంత గత కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులను అలరించే సామ్ సడన్ గా బ్రేక్ తీసుకోవడం చర్చ నియాంశంగా మారింది. అయితే ఈరోజు ‘ యశోద ‘ టీజర్ అప్డేట్ తో సైలెన్స్ ను బ్రేక్ చేసింది. సమంత లేటెస్ట్ మూవీ ‘ యశోద ‘ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్ మంచి ఆసక్తిని కలిగించాయి. వినాయక చవితి సందర్భంగా ‘ యశోద సినిమా ‘ నుంచి సమంత సరికొత్త అప్డేట్ తో వచ్చింది.

Advertisement

సెప్టెంబర్ 9న సాయంత్రం 5:59 గంటలకు గ్రిప్పింగ్ టీజర్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను షేర్ చేసింది అమ్మడు. ఈ పోస్టర్ లో సమంత కొంతమంది అమ్మాయిల మధ్యలో ఇంటెన్స్ గా కనిపిస్తుంది. ఆమె ముఖం మీద గాయాలను కూడా మనం గమనించవచ్చు. యశోద సినిమాలో సామ్ పాత్ర ఏంటి అనేది టీజర్ లో తెలిసే అవకాశం ఉంది. ఈ సినిమాని హరి మరియు హరీష్ తెరకెక్కించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Samantha : సైలెన్స్ ను బ్రేక్ చేసిన అమ్మడు…

Samantha Yashoda movie update teaser launch on September 9th
Samantha Yashoda movie update teaser launch on September 9th

ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. యశోద సినిమాకి ఎం సుకుమార్ సినిమా ఆటోగ్రఫీ అందించారు. అశోక్ ఆర్ట్ డైరెక్టర్ గా, మార్తాన్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు. నిజానికి యశోద సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఆగస్టు 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో వాయిదా వేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. సమంత తెలుగులో జాను సినిమా తర్వాత పుష్ప లో ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పుడు యశోద, శాకుంతలం, ఖుషి వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement