Senior NTR : ఎన్టీఆర్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమా తీయడానికి కారణం ఏంటో తెలుసా…

Senior NTR : సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కు ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ టీవీలో ఎన్టీఆర్ సినిమా వస్తే చాలామంది చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. ఒక్క పాత్ర కాదు వివిధ రకాల పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఎన్టీఆర్ కే సాధ్యం. ఎన్టీఆర్ తన కెరీర్లో ఎన్నో వైవిద్యమైన పాత్రలో నటించారు. జానపదం, సాంఘికం, పౌరాణికం, చారిత్రకం ఇలా ఏ పాత్రలో అయినా జీవించగలిగే హీరో ఎన్టీఆర్ ఒక్కరే.

Advertisement

Senior NTR : ఎన్టీఆర్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమా తీయడానికి కారణం ఏంటో తెలుసా…

ఎన్టీఆర్ కెరీర్లో ఎన్నో గొప్ప సినిమాలే వచ్చాయి. అందులో ఒకటి శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఒకటి. ఈ సినిమా చేయడం వెనుక చాలా చరిత్ర ఉంది. ఎన్టీఆర్ ఒకసారి కడప జిల్లా సిద్ధవటం లోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమానికి వెళ్లారు. అప్పుడు తెరమీద బొమ్మలు ఏదో ఒక రోజు అధికారం లోకి వస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విషయం ఎన్టీఆర్ కు బాగా నచ్చింది. దేవుడు అంటే బహుశా ఇలాగే ఉంటాడేమో అని ఎన్టీఆర్ బ్రహ్మంగారి పాత్రలో జీవించి నటించేశారు. బ్రహ్మంగారి జీవించి ఉండగా వేసుకున్న చెప్పులు అచ్చి గుద్దినట్టు తనకు సరిపోవడం ఎన్టీఆర్ ను చాలా ఆశ్చర్యపరిచింది.

Advertisement
Senior NTR face the problems to veerabrahmendra swamy movie
Senior NTR face the problems to veerabrahmendra swamy movie

దీంతో ఎన్టీఆర్ కు ఈ సినిమా చేయాలని కోరిక కలిగింది. అయితే ఎన్టీఆర్ కూడా నిజంగానే సీఎం అవుతారని కొందరు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తో చెప్పడంతో మద్రాస్ సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు అభ్యంతరం చెబుతూ సెన్సార్ ఇవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ 1980లో మొదలై 1981 లో పూర్తయింది. తర్వాత ఎన్టీఆర్ మూడేళ్లపాటు పోరాటం చేశారు. చివరకు 1984 నవంబర్ 29న ఈ సినిమా రిలీజ్ అయి మంచి హిట్ ను అందుకుంది. విచిత్రం ఏంటంటే ఈ సినిమా విడుదలయ్యే సమయానికి ఎన్టీఆర్ నిజంగానే సీఎం అయ్యారు.

Advertisement