Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 సెప్టెంబర్ 4న అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన సీజన్లన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే ఓటీటీ సీజన్ కూడా పూర్తయింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 6 ను త్వరలో స్టార్ట్ చేయబోతోంది బిగ్ బాస్ యాజమాన్యం. బిగ్ బాస్ 6 కోసం ఇప్పటికే కంటెస్టెంట్లను ఎంపిక చేశారు. వాళ్లను క్వారంటైన్ కు కూడా పంపించేశారు. ఈ సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

బిగ్ బాస్ మూడో సీజన్ నుంచి నాగార్జునే బిగ్ బాస్ అన్ని సీజన్లకు, ఓటీటీకి హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ మొదటి సీజన్ కు మాత్రం ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. రెండో సీజన్ కు నాని హోస్టింగ్ చేశాడు. ఈసారి బిగ్ బాస్ 6 కు హోస్ట్ గా చేస్తున్నందుకు నాగార్జున రూ.15 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కూడా పొందనున్నాడట.
Bigg Boss Telugu 6 : సెప్టెంబర్ 4 న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న బిగ్ బాస్ 6
నిజానికి.. ఆగస్టు చివరి వారంలోనే బిగ్ బాస్ 6 సీజన్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కు బిగ్ బాస్ పోస్ట్ పోన్ అయింది. చివరకు సెప్టెంబర్ 4న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. బిగ్ బాస్ 3 సీజన్ లో ఓ జంట అలరించిన విషయం తెలిసిందే కదా.
వరుణ్ సందేశ్, వితికా షేరు ఇద్దరు భార్యాభర్తలు బిగ్ బాస్ సీజన్ 3 లో అలరించారు. తాజాగా సీజన్ 6 తో కూడా ఓ జంటను తీసుకొస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. సీరియల్, సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన మెరీనా, రోహిత్ జంట బిగ్ బాస్ 6 లో మెరవబోతున్నారు. గోవాకు చెందిన మెరీనా అబ్రహం అమెరికా అమ్మాయి అనే సీరియల్ తో ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమాల్లోనూ మెరిసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.

2017 లో తన సహనటుడు, మోడల్ అయిన రోహిత్ ను పెళ్లాడింది మెరీనా. ఈ జంట యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యారు. చివరకు బిగ్ బాస్ సీజన్ 6 కు ఎంపికయ్యారు.