Skanda : రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమా స్కంద. ఇక ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవల ఈ సినిమా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈ విషయాన్ని సినీ బృందం సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సినిమా రిలీజ్ డేట్ ను గుర్తు చేశాయి. అయితే నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను తెరకేక్కిస్తున్న సినిమా ఇది.
ఇక ఈ సినిమాలో శ్రీ లీల మరియు సాయి మంజరేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన సాంగ్స్ మరియు ట్రైలర్ , టీజర్ సినిమాపై భారి అంచనాలను నెలకొల్పాయి. అసలు వాస్తవానికి సెప్టెంబర్ 15 వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా రావాల్సి ఉంది. కానీ సినిమాలోని పలు కారణాలతో పాటు ఈ నెలలో విడుదల కావాల్సిన సలార్ సినిమా తప్పుకోవడంతో సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది.
ఇకపోతే ఈ సినిమా రన్ టైం అఖండ సినిమా మాదిరిగానే 167 నిమిషాలు ఉండడం గమనార్హం. దీంతో ఈ సినిమా కూడా అఖండ రేంజ్ లో హిట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం భాషలో ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 28 వరకు వేచి చూడాల్సిందే.