Jabardasth faima : జబర్దస్త్ షో తో పాపులర్ అయిన ఫహీమా ఇండస్ట్రీకి రాకముందు ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు 

Jabardasth faima : ఫహీమా అసలు పేరు ఫహీమా షేక్. ఫహీమా కామారెడ్డిలోని సందీపని కాలేజీలో చదువుకునే స్టూడెంట్, పటాస్ షో కి వాళ్ళ కాలేజ్ వాళ్లని పిలిచినప్పుడు తన టాలెంట్ ని చూపించడానికి వెళ్లి, తన కామెడీ టైమింగ్ తో అందరిని ఆకట్టుకుంది. ఫహీమా దోమల కొండవాసి అది ఒక చిన్న గ్రామం. ఆమె వయసు ఇరవై మూడు సంవత్సరాలు. చాలా పేద కుటుంబం. సొంత ఇల్లు కూడా లేదు నెలకు నాలుగు వేల నుంచి అయిదు వేలు రూమ్ రెంట్ కట్టుకుంటూ, ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. కనీస వసతులు కూడా లేవు ఇప్పటికే చాలా ఇల్లు మారారుఅంటూ కొన్ని ఇండ్లల్లో అయితే బాత్రూమ్స్ లేకపోతే టెంపరరీగా కట్టెలతో కట్టుకొని ఉన్నారంట.

Advertisement

ఫహీమా కి ముగ్గురు అక్కలు, వాళ్లకి పెళ్లిళ్లు అయిపోయాయి. ఫహిమా ఆఖరిది. ఫహీమ్ వాళ్ళ నాన్నగారు వీళ్ల దగ్గర ఉండరు నాలుగు సంవత్సరాల క్రితమే వేరే చోటుకు వెళ్లి అక్కడ పని చేసుకుంటూ వాళ్ళ కూతుళ్ళు పెళ్లికి చేసిన అప్పును తీరుస్తూఉన్నారు వాళ్ల అమ్మగారు బీడీలు చేస్తారు హెల్త్ అంతగా బాగోదు అంటా. ఫహీమా కి పటాస్ లో రెండేళ్లు పనిచేసిన తర్వాత కోవిడ్ వల్ల పటాస్ షో ఆగిపోయింది. ఆ తర్వాత మల్లెమాల గారు ఫహీమానీ జబర్దస్త్ లోకి తీసుకున్నారు. ఇప్పుడు ఫలక్ నామా ఫహీమా అనే యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. ప్రతి ఒక్క వీడియోస్ కి మిలియన్ లొ వ్యూస్ వస్తున్నాయి. ఆవిడ చేసిన స్కిట్స్ కి కూడా మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. కామెంట్స్ లలో కూడా ఆవిడని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

Jabardasth faima : జబర్దస్త్ షో తో పాపులర్ అయిన ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు

Some incidents encountered by Jabardasth faima
Some incidents encountered by Jabardasth faima

అంత బాగా నచ్చింది ఫహీమా గారి కామెడీ జనాలకి, ఆవిడ టాలెంట్ తో ప్రేక్షకుల ఆధరన, అభిమానాలు అందుకుంటుంది. బుల్లితెరకు రాకముందు చదువు అయిపోయాక టైలరింగ్ నేర్చుకొని బట్టలు కుడదాం అని అనుకుంది. స్టడీస్ అంటే అంతగా ఇష్టం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ మెహదీపట్నంలో ఒక రూమ్ రెంట్ కి తీసుకొని ఉంటున్నారు. పటాస్ ఆడిషన్స్ కి వచ్చినప్పుడు పెద్దగా ఎవ్వరూ పట్టించుకోకుండా వెయిట్ చేపిస్తూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ల మీద ఫహీమా బాగా సీరియస్ అయ్యిందట, దానితో ఆమె డేర్ నెస్ అండ్ టాలెంట్ ని చూసి ఆడిషన్ లొ సెలక్ట్ చేశారు.

ప్రేక్షకుల్లో బాగా ఫేమ్ సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు ఫహీమా యాభై వేల నుంచి లక్ష రూపాయలు పారిదోషకం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె నెట్వర్త్ ఇరవై లక్షల దాకా ఉంటుంది అని అంచనా. ప్రస్తుతం ఫహీమా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి జబర్దస్త్ లొ ఎవరు ఇష్టం అని అడిగితే బుల్లెట్ భాస్కర్ గారు అని చెప్పింది. ప్రస్తుతం తను నాలుగు షోస్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలో తన కళ ఏమిటి అని అడిగితే హైద్రాబాద్ లో ఒక సొంత ఇల్లు కట్టుకొని వాళ్ళ అమ్మ నాన్నల్ని అక్కడికి తీసుకొచ్చుకుని, జాగ్రత్తగా చూసుకోవాలనేది తన కళ అని చెప్పింది. అయితే ఫహీమాకీ లవ్ బ్రేకప్ కూడా అయ్యిందట.

ఫహీమా కు పటాస్ ప్రవీణ్ అంటే చాలా ఇష్టం అంటా, నలుగురు ఆడ పిల్లలని పెంచి, పెద్ద చేయడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ల అమ్మా నాన్నల వెనుక ఎటువంటి ఆస్తి లేకపోయినా వాళ్ల పిల్లల్ని చదివించి, పెంచి, పెద్దచేసి, పెళ్ళిళ్ళు చేసారంటే గొప్ప విషయమే. ఈ నలుగురు అక్కాచెల్లెళ్లు ఎప్పుడు వేరే ఊరికి వెళ్లే వారు కాదంట. అలాంటిది ఇంట్లో చిన్న కూతురు అయిన ఫహీమా బయటికి వచ్చి ఇంత పాపులర్ అవ్వడం ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆనందంగా ఉంది. నవ్వించే ఫహీమా వెనుక ఎన్నో భాధాలు ఉన్నాయి. ఒకప్పుడు పొలంలో పత్తి వేరడానికి, ఇతర కూలీ పనులకు వెళ్లింది. అసలు బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం మామూలు విషయం కాదు, అలాంటిది తక్కువ సమయంలో ఇంత పాపులర్ అయిన ఫహీమా గారిని చూస్తే వాళ్ల కుటుంబం ఎంతగానో గర్వపడుతున్నారు.

Advertisement