Sreemukhi : బుల్లితెరపై శ్రీముఖి అంటే తెలియని ఎవరు ఉండరు. మరియు మాటకారితనంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో శ్రీముఖి ఎప్పుడూ ముందుంటుంది. శ్రీముఖి చేసే అందాల విందుకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. శ్రీముఖి తన అందాలను ఆరబోస్తుంది సోషల్ మీడియా ద్వారా తను చేస్తున్న ఫోటోషూట్స్ ని షేర్ చేస్తూ తన అభిమానులకు ఆనందాన్ని పంచుతుంది. ఈ అమ్మడు లేటెస్ట్గా చేసిన రెడ్ కలర్ ఫోటో షూట్స్ లో కత్తిలాంటి చూపులతో ఘాటైన అందాలతో గుండెల్లో గుబులు పుట్టిస్తుంది అని సోషల్ మీడియా లో అనుకుంటున్నారు. ఈ ఫోటో షూట్ ఇనీస్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది. ఈ ఫోటో షూట్ లో రెడ్ కలర్ డ్రెస్సులు ఆమె అందాలు రెట్టింపైనట్లుగా కనిపిస్తున్నాయి.
శ్రీముఖి బుల్లితెరపై తాను చేసే అల్లరి ప్రేక్షకులను టీవీ ముందు కట్టిపడేస్తుంది. అంతే కాకుండా ఈ అమ్మడు హీరోయిన్ మెటీరియల్ కు ఏ మాత్రం తీసుకోకుండా అందంగా ఉండడంతో ఇంకా ప్రేక్షకుల ఫాలోయింగ్ పెరిగిపోయింది ఈ బామకు. శ్రీముఖి తాను చేసే ప్రోగ్రాం హైలెట్ కావడం కోసం ఎంత దూరమైనా వెళుతూ తన హద్దులను మించి పర్ఫామెన్స్ ఇస్తుంది. దీనికి ఉదాహరణగా శేఖర్ మాస్టర్ తో ప్రోగ్రాంలో చిందులు వేస్తూ చివరికి ఆయనకు ముద్దు పెట్టడంతో ఈ విషయం శేఖర్ మాస్టర్ ఇంట మరియు బయట ఆయనకు తలనొప్పి తెచ్చి పెట్టింది. శ్రీముఖి ఈ విధంగా చేయడం ఇదే మొదటిసారి కాదు.
Sreemukhi : కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపుతున్న బుల్లితెర బ్యూటీ శ్రీముఖి

ఈ అమ్మడు బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా మెరిసి నటించింది. అల్లు అర్జున్ సరసన చేసిన జులాయి సినిమా లో హీరో చెల్లెలు పాత్రలో కనిపించి అందరికి పరిచయం అయ్యింది. పటాస్ ప్రోగ్రాం ద్వారా తన చిలిపి మాటలు మరియు అందాల ఆరబోతకు అనేక అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఎవరు ఊహించనీ విధంగా బిగ్ బాస్ షో లో అడుగుపెట్టి తన పర్ఫామెన్స్ ఈ షోలో హైలైట్ గా నిలిచింది. శ్రీముఖి చేసిన పర్ఫామెన్స్ బిగ్ బాస్ లో రన్నరప్ నిలిచి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు హవా బుల్లితెరపై నడుస్తుందని చెప్పుకోవచ్చు. శ్రీముఖి బుల్లితెరపై అనేక ప్రోగ్రాములు చేస్తూ సక్సెస్ఫుల్గా తన కెరీయార్ కొనసాగిస్తుంది.