Sri Reddy- అహింస సినిమా ఫ్లాప్ పై దగ్గుబాటి అభిరామ్ ను నానా బూతులు తిట్టినా శ్రీరెడ్డి ..

Advertisement

రెండు తెలుగు రాష్ట్రాలకు వివాదాస్పద నటి శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలోఎవరో ఒక సెలబ్రిటీలను ఆడిపోసుకుంటూ ఉంటుంది. గతంలో శ్రీరెడ్డి దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు అభిరామ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా అవకాశాల పేరుతో తనను వాడుకున్నాడని, తనను ముద్దులు పెట్టుకునే ఫోటోలు కూడా రివీల్ చేసి రచ్చ రచ్చ చేసింది. తాజాగా అభిరామ్ తేజ దర్శకత్వం వహించిన ‘ అహింస ‘ సినిమాలో హీరోగా నటించాడు. అతడికి ఇది మొదటి సినిమా. కానీ అభిరామ్ లుక్స్, నటనపరంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. కంటెంట్ కూడా అంతగా లేకపోవడంతో ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.

Advertisement

అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి అందరూ శ్రీ రెడ్డి ఈ సినిమాకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూందేమో అనుకున్నారు కానీ ఆమె సైలెంటుగా ఉంది. ఇప్పుడు అహింస సినిమా ఫ్లాప్ అవడంతో ఆమె ఓ షార్ట్ వీడియో రిలీజ్ చేసి అందులో దగ్గుబాటి ఫ్యామిలీ, మూవీ డైరెక్టర్, అభిరామ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తన పేరు ఎందుకు వాడుకున్నారు అంటూ తిట్టిపోసింది. సురేష్ బాబుని ఈ సినిమా కోసం మీ నాన్నని, మీ తమ్ముడిని, మీ కొడుకుని వాడుకోవచ్చు కదా మధ్యలో నా పేరు ఎందుకు ప్రస్తావించారు అంటూ ఫైర్ అయ్యింది.

అహింస సినిమా గురించి మాట్లాడుతూ డైలాగ్ సరిగ్గా లేవు, డబ్బింగ్ సరిగా లేదు, హీరో ఆ సినిమాకి అసలు మ్యాచ్ కాలేదు. ఇక హీరోయిన్ అయితే అదొక పెద్ద టార్చర్ అంటూ చెప్పింది. అలాగే డైరెక్టర్ ని ఒరేయ్ డైరెక్టర్గా అన్ని మూసుకొని నీ పని చూసుకో, నా పేరు మీద ప్రమోషన్స్ చేయకండి, ఇలాంటి హింసాత్మక సినిమాకి నా పేరు ఉపయోగించుకోవడం నచ్చలేదు, నన్ను మోసం చేసిన వాళ్ళు చివరికి ఇలాంటి తప్పక అనుభవించుతారు అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ఇకపోతే సురేష్ బాబు తన చిన్న కొడుకు అభిరామ్ విషయంలో ఇలాంటి తప్పు చేశాడు ఏంటి అని అంతా అనుకుంటున్నారు.

Advertisement